BET 2025: బయోటెక్నాలజీలో జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 28 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మే 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

Biotechnology Eligibility Test: బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో 2025 -26 ప్రవేశాలకు సంబంధించి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)-2025 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ ద్వారా వివిధ ఇన్‌స్టిట్యూట్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.650 చెల్లించాలి. ఇతరులు రూ.1300 చెల్లిస్తారు. ప్రవేశ పరీక్షకు సంబంధించి ఫిబ్రవరి 28న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మే 13న కంప్యూటర్ ఆధారిత విధానంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు బీఈటీ-2025 పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలు..
* బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ) 2025
కోర్సులు..
➥ జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (పీహెచ్‌డీ) ప్రోగ్రాంలో ప్రవేశాలు.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంబీబీఎస్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంవీఎస్సీ, ఎంఫార్మసీ, ఇంటిగ్రేడెట్ ఎంఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు, దివ్యాంగులు/మహిళలు 31 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.1300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.650.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు బీఈటీ పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమిషాలు. బీఈటీ 2025 పరీక్ష 2 విభాగాలుగా ఉంటుంది.
➥ సెక్షన్-ఎ: సబ్జెక్టులు- జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, జనరల్ ఆప్టిట్యూడ్, అనలిటికల్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ మరియు జనరల్ బయోటెక్నాలజీ. మొత్తం 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు 03 మార్కులు కెటాయించారు. నోగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి, మొత్తం మార్కుల నుంచి 01 మార్కు తీసివేయబడుతుంది. సమాధానం లేని/ప్రయత్నించని ప్రశ్నలకు జీరో మార్కులు ఇవ్వబడతాయి.
➥ సెక్షన్-బి: మొత్తం150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 50 ప్రశ్నలకు ప్రయత్నం చేసిన సరిపోతుంది. ప్రతి ప్రశ్నకు 03 మార్కులు కెటాయించారు. నోగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి, మొత్తం మార్కుల నుంచి 01 మార్కు తీసివేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరితేది: 28.03.2025.
➥ దరఖాస్తు సవరణ తేదీలు: 30.03.2025 నుంచి 31.03.2025 వరకు.
➥ ప్రవేశ పరీక్షల తేదీ: 13.05.2025.
సమయం: బీఈటీ 2025- ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు
ALSO READ:
సీయూఈటీ పీజీ - 2025 పరీక్ష తేదీలు ఖరారు, ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే?
CUET PG 2024 Exam Schedule: దేశవ్యాప్తంగా 142 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) పీజీ - 2025' పరీక్ష తేదీలు వెల్లడయ్యాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్చి 13 నుంచి ఏప్రిల్ 1 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 43 షిఫ్టుల్లో 157 సబ్జెక్టులకు పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.




















