Artiste Movie: హీరో, విలన్ ఒకేలా ప్రవర్తిస్తే? ఇదేం సైకో థ్రిల్లర్ రా నాయనా... ‘ఆర్టిస్ట్’ ట్రైలర్ చూశారా?
Artiste Trailer: యూత్ ఆడియెన్స్‌కి నచ్చే, మెచ్చే అంశాలతో వచ్చిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుంది. అలాంటి సినిమానే ‘ఆర్టిస్ట్’. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ వదిలారు.

Artiste Trailer Released: ప్రస్తుతం వైవిధ్యభరిత సినిమాలనే కాదు, మంచి సందేశాత్మక చిత్రాలను కూడా ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. యూత్ ఆడియెన్స్‌కి నచ్చే, మెచ్చే అంశాలతో వచ్చిన ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుంది. అలాంటి యూత్‌ని టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకుంటున్న చిత్రమే ‘ఆర్టిస్ట్’. సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకుడు. మార్చి 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..
‘నీకూ నాకూ ప్రపంచం ఒక్కటే కానీ, నువ్వూ నేనూ ఎప్పటికీ ఒక్కటి కాలేము’ అంటూ మొదలైన ఈ ట్రైలర్‌లో డైలాగ్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. ‘సమాజం మనకు చాలా నేర్పిస్తుంది కానీ మనమేం నేర్చుకున్నాం అన్నది ముఖ్యం’, ‘నిన్ను మార్చుకునేంత ప్రేమ నా దగ్గర లేదో లేక, నా కోసం మారేంత ప్రేమ నీకు లేదో నాకు అర్థం కావట్లేదు’, ‘చరిత్రలో కూడా ఎవ్వరు ఎప్పుడూ ఎరగని పన్నాగం క్రైమ్‌ని ఎవరు ఎంకరేజ్ చేయరు. కానీ జరిగిన క్రైమ్ తెలుసుకోవడానికి ఎగబడి మరి చూస్తారు. నేను చేసిన మర్డర్స్ వల్ల ఎంతో మందికి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది’ వంటి డైలాగ్స్ ఈ ‘ఆర్టిస్ట్’ సినిమాలో అన్ని అంశాలూ ఉన్నాయనేది తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా హీరో, విలన్ ఒకేలా ప్రవర్తించడం అనేది ఇందులో కొత్త పాయింట్. మొత్తంగా అయితే, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలని ఇందులో చూపిస్తూ వచ్చిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటమే కాక, సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది.
Also Read: సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్, హాస్పటల్ ఫోటోలు వైరల్... దయచేసి చూపించకండి - అనసూయ రిక్వెస్ట్
ఇక ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో నిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము మాట్లాడుతూ.. ఇవాళ ఒక సినిమాను నిర్మించడం ఈజీనే కానీ, దానిని రిలీజ్ చేయడం అంత సులువైన విషయం కాదు. దీనికి ఎంతో మంది కృషి చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఆర్టిస్ట్’ సినిమాకు టీమంతా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలనేది నా కోరిక. అందుకే మా సంస్థలో చేసే సినిమాలకు కొత్తవాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. ఇది మా సంస్థలో రెండో సినిమా. భవిష్యత్‌లోనూ మూవీస్ చేస్తాం. ఈ సినిమాతో డైరెక్టర్ రతన్ రిషికి మంచి పేరు వస్తుంది. అలాగే హీరో సంతోష్, హీరోయిన్ క్రిషేకకు వారి నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతారు. మా మూవీ సాంగ్స్ టీ సిరీస్ ద్వారా విడుదలై మంచి ఆదరణ పొందుతున్నాయి. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ నెల 21న మూవీని రిలీజ్ చేస్తున్నాం. మైత్రీ వారికి ఈ సినిమా నచ్చి, వాళ్లే రిలీజ్ చేస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. సొసైటీకి కావాల్సిన మంచి కంటెంట్‌తో సినిమా చేశాం. అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు.
దర్శకుడు రతన్ రిషి మాట్లాడుతూ.. ‘ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ. ఇందులో సస్పెన్స్, భయం, కామెడీ, రొమాన్స్ వంటి అన్ని అంశాలుంటాయి. ఒక ఎమోషన్ మీద కథ నడుస్తుంటుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మంచి ఫీల్‌తో థియేటర్స్ నుంచి బయటకు వస్తారు. సురేష్ బొబ్బిలి సరికొత్తగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ట్రైలర్‌లో వయలెన్స్ ఎక్కువగా ఉందని మీకు అనిపించవచ్చు. మూవీలో ఇంత వయలెన్స్ లేదని మా టీమ్ అన్నారు. సైకో థ్రిల్లర్స్ అంటే హత్య జరిగిన తర్వాత కిల్లర్ ఎవరనేది కనిపెట్టడంపై కథ సాగుతుంది. కానీ నేను ముందే విలన్ ఎవరో చెప్పి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశాం. కథ మీద నాకు అంత నమ్మకం ఉంది. ప్యాషనేట్ టీమ్ దొరికింది. ప్రతి ఒక్కరూ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఈ సినిమాను 21న థియేటర్స్‌లో చూసి, సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.
హీరో సంతోష్ కల్వచెర్ల మాట్లాడుతూ.. మా డైరెక్టర్ సొసైటీలో ఉన్న ఒక ప్రాబ్లమ్‌ను చూపించాడు. ఆ సమస్య పాతదే అయినా కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయి. సినిమా చూశాను. ఆ కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నా. ఈ సినిమా చూశాక ఎవరూ రొటీన్‌గా ఉందని అనరు. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉందని అంటారు. మా డైరెక్టర్ ఏది చెబితే అది చేసుకుంటూ వెళ్లిపోయాను. నిర్మాత ప్యాషనేట్ ప్రొడ్యూసర్. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయాలనేది ఆ ప్యాషన్. ఆయన ఈ బ్యానర్‌లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలపగా, ‘హీరో సంతోష్‌తో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. అందరికీ నచ్చేలా సినిమా చేశాం. తప్పకుండా థియేటర్స్‌కు వెళ్లి ‘ఆర్టిస్ట్’ సినిమా చూడాలని కోరుకుంటున్నానని అన్నారు హీరోయిన్ క్రిషేక పటేల్.
ఇంకా ఈ కార్యక్రమంలో లిరిసిస్ట్ రాంబాబు గోసాల, నటి స్నేహ మాధురిశర్మ, నటుడు వెంకీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సురేష్ బసంత్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, నటుడు తాగుబోతు రమేష్ వంటి వారంతా మాట్లాడుతూ.. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అన్నారు.





















