Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
RGV With Police : ఆర్జీవీపై సోషల్ మీడియా పోస్టులు కాకుండా అంత కంటే సీరియస్ అభియోగాలతో కేసులు నమోదయినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన పోలీసుల ఎదుట హాజరవకుండా పరారయ్యారని అంటున్నారు.
RGV : ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చినా హాజరయ్యేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధంగా లేరు. నిజానికి ఆయన పెట్టిన సోషల్ మీడియా పోస్టుల మేరకే కేసులు నమోదు అయితే విచారణ చేసి పంపిస్తారు. కానీ ఆయన తనను ఖచ్చితంగా అరెస్టు చేస్తారని అనుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటన్నదానిపై ఆర్జీవీ సన్నిహితుల్లోనే వివిధ రకాలగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను కించ పరుస్త్తూ సినిమాలు తీయడమే కాకుండా వారిపై దారుణంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. ఇందు కోసం ఆయన డబ్బులు వసూలు చేశారని.. ప్రజాధనంతో ఆయనకు బిల్లు సెటిల్ చేశారన్ నప్రచారం జరుగుతోంది.
రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వం కోసం ఎలాంటి పని చేయలేదు. కానీ ఆయనకు ఎన్నికలకు ముందు రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ కూ రూ. కోటి 14 లక్షల రెండు చెక్కులు ఏపీ ప్రభుత్వం నుంచి ఆయనకు వచ్చాయి. ఆయన వాటిని మార్చిలో డబ్బు చేసుకున్నారు. ఈ డబ్బుల కోసం ప్రభుత్వానికి ఆర్జీవీ చేసిన సేవ ఏంటి ?. ఏ సేన ద్వారా ఆయన ప్రజోపయోగం చేశారు ? అన్నదానిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే అదేమిటో బయటకు రాలేదు.
తన సొంత రాజకీయ లబ్ధి కోసం వర్మ చేత విషం కక్కించే జగన్... తన జేబులోంచి వర్మకు ఇచ్చుకోవాలి. కానీ కోటి పదిహేను లక్షల రూపాయల ప్రజల కష్టార్జితాన్ని ఎందుకిచ్చాడు? రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రజల కోసం చేసిన పనేంటి? ఇది స్కామ్ కిందే లెక్క. కూటమి ప్రభుత్వంలో… pic.twitter.com/syHbEfYL9W
— Telugu Desam Party (@JaiTDP) May 3, 2024
వైసీపీ కోసం వ్యూహం పేరుతో రెండు సినిమాలు తీయడం, చంద్రబాబు, టీడీపీ, వపన్ కు వ్యతిరేకం సోషల్ మీడియాలో కించ పరిచేలా ట్వీట్లు పెట్టినందుకు ఆయనకు ఈ డబ్బులు ఇచ్చారన్న అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఈ చెక్కులను.. ఆర్జీవీ ప్రజాధనం తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టిన టీడీపీ రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వానికి ఏం పని చేశాడో.. ఆయన ఖాతాలో ప్రజాధనం ఎలా చేరిందో జూన్ నాలుగో తేదీ నుంచి బయటకు తీస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ లెక్క బయటకు తీస్తున్నారేమోనన్న భయంతో ఆర్జీవీ పోలీసుల విచారణకు వెళ్లడం లేదని అంటున్నారు. [
రాంగోపాల్ వర్మకి, కోటి 15 లక్షలు జగన్ ఎందుకు ఇచ్చాడు ?
— Telugu Desam Party (@JaiTDP) May 4, 2024
రాంగోపాల్ వర్మ ఏమి సేవ చేసాడని, జగన్ ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చాడు ? #JaruguJagan #EndOfYCP#YCPAntham #2024JaganNoMore #ByeByeJaganIn2024 #AndhraPradesh pic.twitter.com/P1C4yWJDrX
ఆర్జీవీ తీసుకున్న కోట్లకు .. అధికారికంగా ఏ పనీ చేయలేదు. ఫలానా పని చేసినట్లుగా తప్పుడు రికార్డులు సృష్టిస్తే మళ్లీ అదో కేసు అవుతుంది. అసలు ఏ కేసులు పెట్టారో తమకు తెలియడం లేదని.. తమకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదని ఆర్జీవీ లాయర్ చెబుతున్నారు. ఆర్జీవీపై సోషల్ మీడియా లాంటి చిన్న కేసు కాదని.. అంతకు మించి ఉందని అనుమానిస్తున్నారు. ఇదే అనుమానం ఆర్జీవీకి కూడా ఉండటంతో పరారయ్యారని అంటున్నారు.