అన్వేషించండి

Nagula Chavithi 2023: పాములు, నాగులు, సర్పాలు - మీరు వేటిని పూజిస్తున్నారు!

ఏటా నాగుల చవితి, నాగపంచమి వచ్చిందంటే చాలు చర్చ మొదలవుతుంది. పాములు పాలు తాగవని తెలిసినా సింహిస్తారెందుకు? నాగపూజ మూఢనమ్మకం కదా? అనే ఎన్నో ప్రశ్నలు...మరి ఈ వాదనలో నిజమెంత?

Naga Chaturthi  2023

పుట్టలో పాలు పోయకూడదా? నాగపూజ మూఢనమ్మకమా? పాములను హింసించడం అవసరమా? అని కొందరు....

హిందూధర్మంలో నాగపూజ ఉంది..నాగదేవతల్ని పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం అని మరికొందరు...

ఈ వాదనలో ఏది నిజం...
 
ఇంగ్లీష్ లో SNAKE అనేస్తారు..
హిందూ ధర్మంలో నాగులు, సర్పాలని రెండు రకాలున్నాయి.. 

భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు ఏం చెప్పాడంటే

ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః

నేను ఆయుధాల్లో వజ్రాన్ని, గోవుల్లో కామధేనువుని, పుట్టించేవాళ్ళల్లో మన్మధుడిని, సర్పాల్లో వాసుకిని అని అర్థం. వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా ఉంటుంది. ఈ వాసుకినే తాడుగా చేసుకుని క్షీరసాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.

అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్||

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పిత్రులలో ఆర్యముడిని, సంయమవంతుల్లో నిగ్రహాన్ని. అంటూ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగుల్లో అనంతుడనని చెబుతాడు.

Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!

అనంతుడు అంటే ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, వాసుకి రెండో కొడుకు. కద్రువ.. వినతకు చేసిన అన్యాయానికి చింతించి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిన ఆదిశేషువు...తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు. అనంతుడి బలాన్ని చూసిన బ్రహ్మ  భూభారాన్ని మోయమని చెబుతాడు. బ్రహ్మ ఆజ్ఞమేరకు అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాల్లో స్వామివారిని అనుసరించాడని చెబుతారు...రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా అనుసరించాడని పురాణాలు చెబుతున్నాయి.

సర్పాలు-నాగులకు ఉన్న వ్యత్యాసం ఇదే! 
శ్రీ కృష్ణుడు సర్పాల్లో వాసుకి అన్నాడు… 
నాగుల్లో అనంతుడు అన్నాడు...
అంటే సర్పాలు- నాగులు ఒకటి కాదా  అంటే కాదు అనే చెప్పాలి...
సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు కొందరు పండితులు.

Also Read:  కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!

పురాణాల ప్రకారం 
సర్పాలు...నాగులకు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. 
నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు ఏ రూపాన్నైనా ధరించగలవు. 
సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగుతాయి
నాగులకు ఒక విశిష్ట లోకం వుంది
నాగులకు వాయువు ఆహారం….అంటే కేవలం గాలిని పీల్చి మాత్రమే బతుకుతాయి
సర్పాలకు జీవరాశులు ఆహారం

దేవతా సర్పాలు వేరే
సర్పాల్లో దేవతాసర్పాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుందట. ఇవి మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. 

పాములు పాలు తాగవు - ఇది నిజమే కానీ!

పాములు పాలు తాగవన్నది నిజమే. అవి సరిసృపాలు కాబట్టి వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నంగా ఉంటాయి. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటాయి. ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహిస్తాయి. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయని హిందువుల విశ్వాసం. కొన్ని ఆలయాల్లో పాములు పూజలు చేయడం, పాములు అప్పుడప్పుడు కనిపించి మాయమవడమే ఇందుకు ఉదాహరణ....

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

అప్పట్లో మనుషులతో పాటే ఉండేవి

నాగపంచమి, నాగుల చవితి లాంటి నాగదేవతారాధన సమయంలో నాగులు కూడా మనుషులతో కలసి సంచరించేవట. అప్పట్లో మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందులా మనుషులతో పాటూ మనుషులులా సంచరించడం మానేశాయని చెబుతారు. అందుకే వారిని  విగ్రహాల్లో ఆవాహన చేసి పూజిస్తున్నాం.

పుట్టల్లో పాములను పూజించవచ్చా

ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేం. చాలావరకూ మామూలు పాములే. అందుకే నాగదేవతలను పూజించవలసి  వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాల్లో ఉంది.

నాగపూజ మూఢనమ్మకం కాదు

సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను అర్థం చేసుకోపోవడం వల్ల మూఢనమ్మకంగా మారిందంతే అంటారు పండితులు 

గమనిక:  ఇవి పురాణాల్లో ప్రస్తావించినవి, పండితులు నుంచి సేకరించిన వివరాలు..వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా  మీ వ్యక్తిగతం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RCB Won Against CSK Entered into Playoffs | చెన్నైని కొట్టి ప్లేఆఫ్స్‌కు ఆర్సీబీ | ABP DesamVizag Police About Sensational Attack | వైజాగ్‌లో కుటుంబంపై జరిగిన దాడి గురించి స్పందించిన పోలీసులు | ABP DesamPavitra Bandham Chandu Wife Sirisha Comments | సీరియల్ నటుడు చందు మృతిపై భార్య శిరీష సంచలన నిజాలు | ABP DesamWhat if RCB Vs CSK Match Cancelled | ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
అద్భుతం చేసిన ఆర్సీబీ, చెన్నైకి బిగ్‌ షాక్‌ - ప్లే ఆఫ్స్ చేరిన బెంగళూరు
Nagababu: ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
ఎలక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అరాచకాలకు ఛాన్స్! స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పహారా ఉండాలి: నాగబాబు
Prabhas Bujji: ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
ప్రభాస్‌ బుజ్జిని పరిచయం చేసిన 'కల్కి 2898 AD' టీం - ఆసక్తి పెంచుతన్న స్పెషల్ వీడియో, కానీ ఓ ట్విస్ట్‌
Sania Mirza: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకుంటుందా? - పాక్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌
Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Upma History: ఇప్పుడు మనం తింటున్న ఉప్మా అంతా ఒకప్పటి చెత్తే, తెల్లోడు చేసిన అతి పెద్ద మోసం ఇది
Rains: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ - ఈ నెల 23 వరకూ భారీ వర్షాలు
BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Embed widget