Karthika Masam 2023: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!
Karthika Masam 2023: కార్తీకం నెలరోజులు నియమాలు పాటించేవారు కొందరు..ప్రత్యేక రోజుల్లో మాత్రమే నియమాలు అనుసరించేవారు ఇంకొందరు. వాటిలో ముఖ్యం కార్తీక సోమవారం..మరి ఆ రోజు పాటించాల్సిన విధులేంటో తెలుసా
Karthika Masam 2023
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్
అర్థం
కార్తీక మాసానికి సమానమైన మాసం, కృత యుగానికి సమానమైన యుగం, వేదానికి సమానమైన శాస్త్రం, గంగకు సమానమైన తీర్థం లేదు..
కార్తీకమాసం నెలరోజులూ ప్రత్యేకమే అయినా సోమవారాలు మరింత విశేషమైనవి. నెలరోజులు నియమాలు పాటించినా లేకున్నా కార్తీక సోమవారాల్లో కొన్ని ప్రత్యేక విధులు ఆచరిస్తారు. అయితే అందరూ కార్తీకసోమవారం చేస్తున్నాం అంటారు..అంటే ఏంటి...ఉపవాసమా, పూజా, నక్తమా... అసలు కార్తీకసోమవారం వ్రత విధిలో ఆరు రకాలున్నాయని మీకు తెలుసా....
కార్తీకంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారని శాస్ర్తవచనం. ఈ సోమవార వ్రతవిధి 6 రకాలు...
1.ఉపవాసము
2.ఏకభక్తము
3.నక్తము
4.అయాచితము
5.స్నానము
6.తిలదానము
Also Read: దీపావళికి దీపాలు వెలిగించేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఇవే!
ఉపవాసము
శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా అభోజనము (ఉపవాసం)తో గడిపి...సూర్యాస్తమయం కాగానే శివుడిని అభిషేకించి, పూజించి..నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు
ఏకభక్తమ
రోజంతా కఠిన ఉపవాసం చేయలేనివారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికుని - మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు తులసీ తీర్ధమో మాత్రమే తీసుకుంటారు
నక్తము
పగలంతా ఉపవాసం ఉండి..రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునం కానీ, ఉపాహారం కాని స్వీకరిస్తారు
అయాచితము
రోజంతా ఉపవాసం ఉండి..తమ భోజనాన్ని తాము వండుకోకుండా..ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచితము అంటారు
Also Read: దీపావళి 5 రోజుల పండుగ - ఏ రోజు ఏంచేయాలి, విశిష్ఠత ఏంటి!
స్నానం
ఉపవాసాలు, నక్తం, ఏకభుక్తం, అయాచితం ఇవి ఏవీ చేయలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేస్తారు
తిలదానము
మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజు నువ్వులు దానం చేసినా మంచిదని సూచిస్తున్నారు పండితులు...
పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన విష్ణు సాయుజ్యం పొందుతారని కార్తీక పురాణంలో ఉంది. ముఖ్యంగా కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారం పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనము చేసి రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.
ఓం నమస్తే అస్తు భగవాన్ - శివ స్తోత్రం
నమస్తే అస్తు భగవాన్
విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాలాగ్ని - కాలాయ
కాలాగ్ని - రుద్రాయ నీలకాంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమాన్ మహాదేవాయ నమ
Also Read: శనిదోషం తొలగిపోవాలంటే దీపావళికి నువ్వులతో దీపం ఇలా వెలిగించండి!
కార్తీక సోమవారాలు సహా ఈ నెలలో ముఖ్యమైన రోజులివే
- 2023 నవంబరు 14 మంగళవారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
- నవంబరు 15 బుధవారం యమవిదియ - భగినీహస్త భోజనం
- నవంబరు 17 శుక్రవారం నాగుల చవితి
- నవంబరు 20 కార్తీకమాసం మొదటి సోమవారం, కార్తావీర్యజయంతి
- నవంబరు 22 యాజ్ఞవల్క జయంతి
- నవంబరు 23 మతత్రయ ఏకాదశి
- నవంబరు 24 శుక్రవారం క్షీరాబ్ది ద్వాదశి
- నవంబరు 26 ఆదివారం జ్వాలా తోరణం
- నవంబరు 27 సోమవారం - కార్తీకమాసం రెండో సోమవారం, కార్తీకపూర్ణిమ (Karthika Pournami 2023)
- డిసెంబరు 04 కార్తీకమాసం మూడో సోమవారం
- డిసెంబరు 11 కార్తీకమాసం నాలుగో సోమవారం
- డిసెంబరు 13 బుధవారం పోలి స్వర్గం
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' వెలిగించడం ఎంత ముఖ్యమో తెలుసా!