దీపావళి రోజు చేసే లక్ష్మీపూజ వెనుక ఓ ప్రత్యేకత ఉంది. యుగయుగాలుగా ఈ లక్ష్మీపూజకు ప్రాముఖ్యత ఉంది.
దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుడి పిలుపు మేరకు ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్నిస్తాడు. అహంకారంతో ఆ హారాన్ని ఐరావతం మెడలో వేసేస్తాడు. ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది.
ఆగ్రహించిన మహర్షి దేవేంద్రుడిని శపిస్తాడు. ఆ శాప పలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోయిన దేవేంద్రుడు..దిక్కుతోచని స్థితిలో శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాడు.
కరుణించిన శ్రీ మహావిష్ణువు...ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని ఉపదేశిస్తాడు
ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సరిసింపదలు తిరిగొచ్చాయని పురాణ కథనం. అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలూ చేకూరతాని విశ్వాసం.
శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసుర సంహారం చేశాడు. నరకుడు చతుర్థశి రోజు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు.
రాక్షసుడి బారినుంచి విముక్తి కలగడంతో ఆనందంతో బాణసంచా కాల్చారని కథనం
రావణ సంహారం అనంతరం సతీసమేతంగా అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. అందుకే దసరా సందర్భంగా రావణ దహనం కార్యక్రమం నిర్వహిస్తారు..
.దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి. రావణ సంహారం తర్వాత అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారని చెబుతారు.