ధనత్రయోదశి రోజు బంగారం ఎందుకు కొనాలి!



ఈ ఏడాది నవంబరు 11 శనివారం రోజు ధనత్రయోదశి వచ్చింది. ఈ రోజునే బంగారం ఎందుకు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ వెనుక కొన్ని పురాణ కథలున్నాయి.



అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం



ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు, ఆస్తులు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు.



ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.



ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం ధన్వంతరిని కూడా పూజిస్తారు.



మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు.



ధనత్రయోదశిని దక్షిణ భారతదేశంలో కన్నా ఉత్తరాదివారే ఎక్కువగా జరుపుకుంటారు. రాను రాను దక్షిణాదివారూ ఫాలో అవుతున్నారు.



తమ శక్తి కొలది బంగారం కొనుగోలు చేసి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తుంటారు. వినాయకుడు, లక్ష్మీదేవి, కుబేరుడి బొమ్మలు కొత్తవి కొనుగోలు చేసి పూజించడాన్ని శుభప్రదంగా భావిస్తారు.



సాధారణంగా ఈ పూజను ప్రదోష వేళలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాల కాలాన్నే ప్రదోషకాలం అంటారు.



Images Credit: Pinterest