దీపావళికి 'యమదీపం' వెలిగించడం మర్చిపోవద్దు



ధనత్రయోదశితోనే దీపావళి పండుగ మెుదలవుతుంది. ఈ పండుగ రోజు 'యమదీపం' వెలిగిస్తారు.



ఈ దీపం వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని, అపమృత్యు దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు.



ధనత్రయోదశి రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఈ దీపం వెలిగించాలి



మట్టి ప్రమిదల్లో కానీ పిండితో తయారు చేసిన ప్రమిదల్లో కానీ నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వెలిగించి దీపారాధన చేస్తారు.



యముడు దక్షిణ దిక్కుకు అధిపతిగా ఉంటాడు కాబట్టి..ఇంటి ఆవరణంలో దక్షిణం వైపు ధాన్యపు రాశి మీద ఈ దీపాలు వెలిగిస్తారు.



ఈ దీపం వెలిగించడం వల్ల యముడు శాంతిస్తాడని అకాల మరణం దరి చేరనీయడమని విశ్వసిస్తారు.



యమదీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన మంత్రం
'మృత్యునాం దండపాశాభయం కాలేన్ శ్యామయ సః
త్రయోదశ్యాం దీపదానాత్ సూర్యజః ప్రియతాం మామ్'



ధన త్రయోదశి రోజు తమ వారసులను అనుగ్రహించడానికి పితృదేవతలు కిందికి దిగి వస్తారని పెద్దలు చెబుతుంటారు. వారికి దారి చూపడానికి ఇంట్లో దక్షిణం వైపు దీపం పెట్టాలని అంటారు.



ఇలా యమదీపారాధాన చేసిన వారింట అపమృత్యు దోషాలు తొలిగిపోతాయని విశ్వాసం.



ఈ ఏడాది నవంబరు 11 శనివారం ధన త్రయోదశి వచ్చింది...



Image Credit: Pinterest