అన్వేషించండి

Nagula Chavithi 2023 Date and Time: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!

Nagula Chavithi 2023 Telugu: కార్తీక శుద్ధ చవితి రోజు నాగులచవితిగా జరుపుకుంటారు. ఈ ఏడాది (2023) లో చవితి తిథి ఎప్పుడొచ్చింది, పుట్టలో పాలుపోసే ముహూర్తం ఎప్పుడో చూద్దాం...

Nagula Chavithi 2023 Puja Muhurat: హిందూ సంప్రదాయంలో నాగ పంచమి, నాగులచవితి వేడుకలు ప్రత్యేకం. నాగదేవతను ఆరాధించే ఈ వేడుకల్లో నాగుల పంచమిని శ్రావణమాసం శుక్లపక్షం పంచమి తిథి రోజు జరుపుకుంటే...నాగుల చవితి వేడుకలు కార్తీకమాసం పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు జరుపుకుంటారు. ఈ ఏడాది నాగుల చవితి నవంబరు 17 శుక్రవారం వచ్చింది  మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను 'వెన్నుపాము' అంటారు. కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారంలా ఉంటుందని  "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్టు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని కక్కతూ మనిషిలో సత్వగుణాన్ని హరించివేస్తుంది. అందుకోసమే నాగుల చవితిరోజు  ప్రత్యక్షంగా విషసర్పాలున్న పుట్టలను ఆరాధించి పాలుపోస్తే మనిషిలో ఉన్న విషసర్పం శ్వేతత్వం పొందుతుందని చెబుతారు. 

Also Read: ఈ రోజే (నవంబరు 15) భగినీ హస్త భోజనం, సోదరుడి క్షేమాన్ని కోరుకుంటూ జరుపుకునే వేడుక!

నవంబరు 17 నాగులచవితి

చవితి ఘడియలు తిథి నవంబరు 16 గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకు మొదలై...నవంబరు 17 శుక్రవారం ఉదయం 11.32 వరకూ ఉంది. అందుకే నవంబరు 17 శుక్రవారం నాగులచవితి జరుపుకుంటారు. 

రాత్రివేళ చేసే పండుగలు ( దీపావళి అమావాస్య, అట్ల తదియ,కార్తీక పౌర్ణమి) అయితే రాత్రికి తిథి ఉండడం ప్రధానం. మిగిలిన అన్ని పండుగలకు సూర్యోదయానికి తిథి ఉండడమే లెక్కలోకి వస్తుంది. అంతెందుకు రీసెంట్ గా జరుపుకున్న దీపావళికి ఇదే అనుసరించారు. సూర్యోదయానికి చతుర్థశి తిథి,సూర్యాస్తమయానికి అమావాస్య తిథి ఉండడంతో నరకచతుర్థశి, దీపావళి అమావాస్య ఒకేరోజు జరుపుకున్నారు. ఇక నాగుల చవితికి సూర్యోదయానికి తిథి ప్రధానం కాబట్టి నవంబరు 17 శుక్రవారమే నాగుల చవితి. 

పుట్టలో పాలుపోసే ముహూర్తం

సాధారణంగా ఉదయం సమయంలో వర్జ్యం,దుర్ముహూర్తాలు ఉంటాయి. ఈ సమయంలో పుట్టలో పాలు పోయరు. అందుకే వర్జ్యం, దుర్ముహూర్తం లేని సమయం చూసి ఇంట్లో పూజ పూర్తిచేసి ఆ తర్వాత పుట్టలో పాలుపోయాలి..
నవంబరు 17 శుక్రవారం దుర్ముహూర్తం - ఉదయం 8.23 నుంచి 9.08 వరకు...తిరిగి మధ్యాహ్నం 12.08 నుంచి 12.54 వరకు
నవంబరు 17 శుక్రవారం వర్జ్యం - మధ్యాహ్నం 12.46 నుంచి 2.18 

చవితి ఘడియలు శుక్రవారం ఉదయం పదకొండున్నరవరకూ ఉంది...అంటే ఆ సమయంలో వర్జ్యం లేదు.. ఇక దుర్ముహూర్తం  ఉన్న సమయం మినహాయించి...ముందుగా కానీ..దుర్ముహూర్తం పూర్తయ్యాక చవితి ఘడియలు దాటిపోకుండా అంటే పదకొండున్నరలోపు నాగేంద్రుడి పూజ చేయాలి...

Also Read:  కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!

పుట్ట దగ్గర ఇలా చదువుకుంటారు
నన్నేలు నాగన్న , నాకులమునేలు 
నాకన్నవారలను నాఇంటివారనేలు
ఆప్తమిత్రులనందరిని ఏలు 
పడగ తొక్కిన పగవాడనుకోకు 
నడుము తొక్కిన నావాడనుకో
తోక తొక్కితే తొలిగిపో వెళ్లిపో
ఇదిగో ! నూకల్ని పుచ్చుకో మూకల్ని ( పిల్లల్ని) ఇవ్వు
అని పుట్టలో పాలు పోస్తూ నూక వేసి వేడుకుంటారు 

ప్రార్థన
పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ....

నాగ ప్రతిమ ఆరాధన
కొన్ని చోట్ల ప్రజలు తమ ఇళ్ల గోడలపై పాముల బొమ్మలు గీసి పూజలు చేస్తారు. పుట్టలు అందుబాటులో ఉన్నవారు స్వయంగా పుట్టలదగ్గరకు వెళ్లి పాలుపోసి పూజిస్తారు. పుట్టలు అందుబాటులో లేనివారు నాగప్రతిమలను ఆరాధించవచ్చు.  ఈ రోజు నాగదేవతతో పాటు శివుడిని పూజించడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదని ఒక నమ్మకం సాధారణంగా ప్రతి శివాలంయలోనూ రావిచెట్టు దగ్గర నాగప్రతిమలు ఉంటాయి. వాటికి పాలతో అభిషేకం చేసి అలంకరించి భక్తితో నమస్కరిస్తే సరిపోతుంది. 

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

గమనిక: ఇవి పండితులు నుంచి సేకరించిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా  మీ వ్యక్తిగతం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget