అన్వేషించండి

Karthika Masam 2023: కార్తీకమాసంలో రోజూ తలకు స్నానం చేయాలా!

Karthika Masam 2023: కార్తీకమాసంలో పాటించే నియమాలు చాలా ఉంటాయి. వాటిలో మొదటిది నిత్యం తలకు స్నానమాచరించడం. ఈ నియమాన్ని ఆచరించేవారి సంగతి సరేకానీ.. ఆచరించలేనివారికి భక్తి లేనట్టా!

Karthika Masam 2023:  భగవంతుడిపై మనసు లగ్నం చేయడమే భక్తి. ఇలా చేస్తే మాత్రమే భగవంతుడు కరుణిస్తాడని అనుకోవడం చాదస్తం.  భక్తి ప్రదర్శించే విషయంలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. కొందరు నిత్య పూజలు కఠిన నియమాలు ఆచరిస్తారు, మరికొందరు మనసులోనే దేవుడిని ప్రార్థిస్తారు, ఇంకొందరు మానవ సేవే మాధవ సేవ అని - మూగజీవాలకు సేవ చేయడం కన్నా ఇంకేం ఉంటుందంటారు. అయితే దైవారాధనలో భాగంగా  నియమాలు పాటించడం మంచిదే కానీ ఇలా మాత్రమే చేయాలి, అలా చేయకపోతే దేవుడు కరుణించడు..అది భక్తి కాదు అనుకోవడం అస్సలు సరికాదంటారు పండితులు. 

Also Read: కార్తీక సోమవారం వ్రతవిధి 6 రకాలు, మీరు అనుసరించేది ఏది!

సాధారణంగా కార్తీకమాసం అనగానే నెలరోజుల పాటూ చన్నీటి స్నానాలు, దీపాలు, పూజలు.. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణమే.  పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలతో ఆలయాలు మారుమోగిపోతుంటాయి. కొందరు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి రోజుల్లో నియమాలు పాటిస్తే మరికొందరు కార్తీకమాసం మొత్తం తెల్లవారుజామునే చన్నీళ్లతో తలకు స్నానాలు చేస్తుంటారు. కొందరైతే భక్తి పేరుతో అనారోగ్యాన్ని కూడా లెక్కచేయరు. కానీ తలకు స్నానం చేస్తేనే భక్తి అనుకుంటే పొరపాటే..ఎందుకంటే కార్తీకమాసంలో నిత్యం తలస్నానం చేయడం వెనుకున్న ఆంతర్యం వేరే అని చెబుతారు.

Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

నిత్యం తలకు స్నానం ఎందుకు
సూర్యోదయానికి ముందు వణికించే చలిలో తలకు చన్నీటిస్నానం చేయమనడం వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. అప్పటివరకూ బయటపడని అనారోగ్య సమస్యలేమైనా ఉంటే బయటపడతాయి . అప్పటి వరకూ తాము చాలా ఆరోగ్యంగా ఉన్నాం అనుకున్నవారిలో కూడా ఏదైనా అనారోగ్య సమస్య దాక్కుంటే అది బయటపడుతుంది..అంటే ఆరోగ్యంపై క్లారిటీ వస్తుంది. పైగా సూర్యోదయానికి ముందు చన్నీటి స్నానం శరీరానికి పట్టిన బద్ధకాన్ని వదిలించడంతో పాటూ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అంతేకానీ సూర్యోదయానికి ముందే స్నానం చేయకపోతే పాపం చుట్టుకుంటుందని కొందరు, ఉపవాసం ఉండకపోతే భక్తి కాదని అంటారేమో అని మరికొందరు ఆలోచిస్తారు...ఆ ఆలోచన వెనుకున్నది కూడా భక్తే అయినప్పటికీ ఇలా చేస్తేమాత్రమే భక్తి అనుకోవద్దని సూచిస్తున్నారు పండితులు. ఎందుకంటే అప్పటికే చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిత్యం తలస్నానాలు చేయడం, చన్నీటి స్నానాలు చేయడం వల్ల అనారోగ్యం మరింత పెరుగుతుంది. అందుకే మీ ఆరోగ్యం సహకరించకపోయినా కానీ నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు..మీకు అంతగా పట్టింపు ఉంటే కార్తీకమాసం మొదటి రోజు, కార్తీకసోమవారం, ఏకాదశి, కార్తీక పౌర్ణమి, పోలి స్వర్గం రోజు తలకు స్నానమాచరించి ఇంట్లో, తులసి మొక్క దగ్గర, ఆలయాల్లో దీపాలు వెలిగిస్తే సరిపోతుంది. 

కార్తీకమాసం నియమాలు ఆచరించేవారు ఇవి గమనించండి

  • కార్తీకమాసంలో మొదటి వారం రోజులు మీరు పాటించిన నియమాల కారణంగా మీరు తేలికపడ్డారా, మరింత అనారోగ్య సమస్యల్లోకి కూరుకుపోయారా అనేది గమనించుకోవాలి
  • కార్తీకమాసంలో ఈ నియమాలు పాటించకపోతే ఏదో జరుగుపోతుందనే  అపోహ నుంచి బయటకు రావాలి
  • ఇక ఇళ్లలో స్నానం చేసేవారి సంగతి సరేకానీ...నదుల్లో, చెరువుల్లో స్నానాలు ఆచరించేవారు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే అప్పట్లో నదుల్లో, చెరువుల్లో ఇంత కాలుష్యం ఉండేది కాదు...నీరు స్వచ్ఛంగా ఉండేది..కానీ ఇప్పటి పరిస్థితి ఎలా ఉందో అందరకీ తెలిసినదే. అందుకే మీరు స్నానమాచరించే ప్రదేశంలో నీరు స్వచ్ఛంగా ఉందో లేదో గమనించండి

హిందూ ధర్మంలో పాటించే నియమాలన్నీ మన జీవనవిధానాన్ని సక్రమంగా మార్చుకునేందుకు, కొన్ని మంచి అలవాట్లు అలవర్చుకునేందుకు, పరిసరాల పరిశుభ్రతకోసమే అని తెలుసుకోవాలి...

Also Read:  ఇంటి ఆవరణలో ఉండాల్సిన - ఉండకూడని చెట్లు ఇవే!

కార్తీకపురాణం ప్రకారం...మనస్ఫూర్తిగా చేసే నమస్కారం, భక్తితో వెలిగించే దీపం కార్తీకమాసంలో అత్యంత ప్రధానం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Hyderabad News: రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మతిపోగొట్టే రాయల్ వింటేజ్ కార్స్, కార్స్ 'ఎన్' కాఫీలో చూసేద్దామా?షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమనSajid Khan Nomal Ali vs England | రెండు టెస్టుల్లో 39వికెట్లు తీసి బజ్ బాల్ ను సమాధి చేశారు | ABPInd vs NZ Test Series | WTC 2025 ఫైనల్ ఆడాలంటే టీమిండియా ఇలా చేయాల్సిందే.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'రాజకీయంగా ఎదుర్కోలేకే మా బంధువులపై కేసులు' - కుట్రలతో గొంతు నొక్కాలని చూస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
Janwada Farm House: జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
జన్వాడ ఫాంహౌస్ ఘటన - డీజీపీకి కేసీఆర్ ఫోన్
Andhra News: ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
ఆ ఐఏఎస్‌లకు పోస్టింగులు - ఆమ్రపాలికి ఏ పోస్టింగ్ ఇచ్చారంటే?
Hyderabad News: రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
రాజ్‌పాకాల సోదరుడి విల్లాలో సోదాలు - బీఆర్ఎస్ నేతల అరెస్ట్
YS Sharmila: 'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే' - వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదంటూ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వారే' - వైఎస్ మరణానికి కాంగ్రెస్ కారణం కాదంటూ వైఎస్ షర్మిల స్ట్రాంగ్ కౌంటర్
Honda Goldwing Tour: ఈ హోండా బైక్ రేటు ఫార్ట్యూనర్ కంటే ఘాటు - ఇండియాలో లాంచ్ - అంత స్పెషల్ ఏముందబ్బా?
ఈ హోండా బైక్ రేటు ఫార్ట్యూనర్ కంటే ఘాటు - ఇండియాలో లాంచ్ - అంత స్పెషల్ ఏముందబ్బా?
JioBharat 4G: వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ - రూ.700కే 4జీ ఫోన్!
వినియోగదారులకు జియో బంపర్ ఆఫర్ - రూ.700కే 4జీ ఫోన్!
Telugu Actor: ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
ప్రెస్‌మీట్‌కు తాగి వచ్చిన నటుడు... పిచ్చి పిచ్చి మాటల వెనుక కారణం అదేనా?
Embed widget