కామన్ గా వచ్చే కలలు - వాటిఫలితాలు



ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి లోయలో పడిపోతున్నట్టు కల వస్తే మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నట్టు భావించాలి.



మీకు మీరు నగ్నంగా కనిపిస్తే..కొన్ని విషయాల్లో మీకున్న తొందరపాటుని, ఆతృతను తెలియజేస్తుంది. కొత్త ప్రదేశంలోకి వెళ్లబోతున్న వారికి, కెరీర్లో ఉన్నత స్థానం సాధించినవారికి ఇలాంటి కలలు వస్తాయి



పరీక్ష రాస్తున్నట్టు కల వస్తే వారు చదువు లేదా పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సూచన.



ఎవరైనా సెలబ్రిటీని కలిసినట్టు కల వస్తే మీలో ఉన్న నైపుణ్యాలు బహిర్గతమవుతున్నట్టు భావించాలి.



మీరు చనిపోతున్నట్టు కల వస్తే మీరు మీ జీవితంలో ఏదైనా సంబంధం, ఉద్యోగం లేదా మీరు రెగ్యులర్ గా చేసే ఏదైనా పనికి శాశ్వతంగా ఫల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్టు అర్థం చేసుకోవాలి.



ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్టు కల వస్తే మీరు ఎదుర్కొంటున్న ఏదో ఓ సమస్యను కొంత సేపు పక్కన పెట్టాలనుకుంటున్నారని అర్థం.



మీ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నట్టు కల వస్తే అది మీ భాగస్వామి మీ పట్ల చూపుతున్న శ్రద్ధ, ఆసక్తిని తెలియజేస్తుంది. భాగస్వామిపై పూర్తిగా నమ్మకం కోల్పోయినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తాయి.



అనుకున్న సమయం కన్నా ఎక్కడికైనా ఆలస్యంగా వెళ్లినట్టు కలొస్తే..ఆ తర్వాత రోజు ఆ వ్యక్తి నిర్దిష్ట సమయానికల్లా ఏదైనా ముఖ్యమైన ప్రదేశానికి తప్పనిసరిగా వెళ్లాలని అర్థం.



దంతాలు ఊడినట్టు కలవస్తే..లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం ఆసక్తి చూపుతున్నారని అర్థం..



పాములు కనపడినట్టు కల వస్తే ఆ వ్యక్తి తమను తాము కొత్త వ్యక్తిగా మార్చుకోవాలని చూస్తున్నట్టు. పాములు కలలో కనిపించడాన్ని శుభంగానే భావిస్తారు.


Thanks for Reading. UP NEXT

నవంబరు 13 - 14 కార్తీకమాసం ఎప్పటి నుంచి మొదలు!

View next story