అసలు క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా!



భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం. చాలా ప్రాంతాల వారి ప్రధాన ఆహారం...శీతాకాలంలోనే వృద్ధి చెందుతుంది.



దీపావళితో శీతాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే పంటను నాశనం చేసే రకరకాల కీటకాలు వృద్ధి చెందుతాయి.



కీటకాల కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ కీటకాల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఈ సమస్యకు గంధకం వినియోగం మంచి పరిష్కారం.



దీపావళి రోజు బాణసంచా కాల్చడం వల్ల గాలిలో గంధకం పొగ వ్యాపించి కీటకాలను నివారిస్తుంది.



బురద, తడి, వానలు కారణంగా పెరిగిన క్రిమికీటకాలు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభిస్తాయి. పంటపొలాలు కోతలకి వచ్చి వాటిలో బాగా పెరిగిన పురుగులు, దోమలు వీరవిహారం చేస్తాయి..



ఈ సమయంలో గంధకం, పొటాషియం వంటి రసాయనాల పొగపెడితే వాటి విజృంభణను నివారించవచ్చు.



పొగ వెయ్యండి అంటే అందరూ వెయ్యరుకదా! పండగలో భాగంగా చెయ్యమంటే తప్పకుండా చేస్తారు.



డెంగ్యూ ఫివర్‌ కలిగించే దోమలు కూడా టపాకాయలు కాల్చినప్పుడు వచ్చే పొగవల్ల నశిస్తాయట.



అయితే అతి సర్వత్రా వర్జయేత్ అనే మాటని ఇక్కడ మరిచిపోరాదు. క్రాకర్స్ కాల్చొచ్చు అనే వాదనతో వాయుకాలుష్యం, శబ్ధకాలుష్యం పెరిగేంతగా కాల్చకూడదు.. Images Credit: Freepik