చాణక్య నీతి: ఇలాంటి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులుండవు



ప్రతి వ్యక్తి తన కుటుంబంలో దేనికీ కొరత ఉండకూడదని కోరుకుంటాడు. అలా జరగాలంటే లక్ష్మీదేవి కృప ఉండడం చాలా ముఖ్యం



ఎలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందో చాణక్యుడు నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు



కుటుంబంలో ప్రేమ
ఇంట్లో అందరూ కలసిమెలసి ప్రేమగా ఉండాలి. ఏ కుటుంబంలో ఐతమత్యం ఉంటుందో ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది.



సానుకూల శక్తి ఉన్న ఇంట్లోకి ప్రతికూల శక్తికి అవకాశం ఉండదు..ఆ ఇంట్లో ఆదాయం, ఆనందం, పురోభివృద్ధి రోజురోజుకీ పెరుగుతాయి



పెద్దలు, జ్ఞానులు, మహాత్ముల మాటలను గౌరవించాలి. వారి బోధనలు అనుసరించిన వారింట్లో ధనధాన్యాలకు కొదువ ఉండదంటాడు చాణక్యుడు



గొప్పవారు చెప్పేమాటలు వినడం ఎంత ముఖ్యమో..మూర్ఖులు చెప్పే మాటలు పట్టించుకోపోవడం కూడా అంతే ముఖ్యం.



మూర్ఖుల మాటలు పరిగణలోకి తీసుకోవడం వల్ల ఎదుగుదుల ఆగిపోతుంది..ఇలాంటి వారు ఎప్పటికీ లక్ష్మీదేవి కృపకు పాత్రులు కాలేరు.



పెద్దలు ఆహారాన్ని గౌరవించినప్పుడు పిల్లలకు ఆ సంస్కారం నేర్పించగలుగుతారు. నచ్చినంత తిని మిగిలినది పడేసే అలవాటుమాన్పించాల్సిన బాధ్యత పెద్దలదే...



పనిచేసే సామర్థ్యం లేకపోతే సరేకానీ..సామర్థ్యం ఉండికూడా పనిచేయకుండా కూర్చుని తినేవారున్న ఇంట్లో లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది.



శక్తి సామర్థ్యాలకు మేరకు కష్టపడితేనే లక్ష్మీ, అన్నపూర్ణ అనుగ్రహం ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.
Images Credit: Pinterest