దీపావళి పండుగ 3 రోజులు ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి!



ధన త్రయోదశి రోజు 13 దీపాలను వెలిగించాలని చెబుతారు పండితులు. ఈ దీపాల‌ను ఇంటి ప్రవేశద్వారం వద్ద, వంటగది, పూజ గది వంటి వివిధ ప్రదేశాలలో ఉంచాలి.



ప్రతి దీపానికి ఒక ప్ర‌త్యేక అర్ధం ఉంటుంది. ఉదాహరణకు తలుపు వద్ద ఉంచిన దీపం అతిథులను స్వాగతించడంతో పాటు ఇంటికి శ్రేయస్సును సూచిస్తుంది.



వంటగదిలో ఉంచిన దీపం సమృద్ధిగా ఆహారం, మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. పూజ గదిలో ఉంచిన దీపం భగవంతుని ఆరాధన, ఆశీస్సులతో పాటు మ‌న‌ కోరికను సూచిస్తుంది.



కాళీ చౌదాస్ అని కూడా పిలుచుకునే చోటి దీపావళి నాడు, 14 దీపాలను వెలిగించడం శుభప్రదంగా పరిగణిస్తారు



ఈ దీపాలను అంచు చుట్టూ 11 దీపాలు, మధ్యలో నాలుగు ముఖాల దీపాలతో ఒక ప్లేట్‌లో ఉంచాలి.



ముందుగా నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించాలి, ఆ తర్వాత మిగిలిన 11 దీపాలను వెలిగించాలి.



లక్ష్మీపూజ అని కూడా పిలిచే దీపావళి రోజున, ఇల్లు మొత్తంతో పాటు ప్రాంగణంలో అనేక దీపాలను వెలిగించ‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోంది.



ఇది ప్రకాశవంతమైన, సంపన్నమైన భవిష్యత్తు కోసం కోరికల‌ను సూచిస్తుంది.



స్వచ్ఛమైన హృదయంతో, మంచి మ‌న‌స్సుతో హృదయపూర్వకంగా భ‌గ‌వంతుని స్మ‌రిస్తూ దీపాలను వెలిగించాలి



Image Credit: Pixabay