ఆచార్య చాణక్యుడి బోధనల ప్రకారం బంగారాన్ని సానపట్టాలి, కత్తిరించాలి, అగ్నిలో వేడి చేసి పరీక్షించాలి
అలాగే మనం ఓ వ్యక్తిని విశ్వసించే ముందు లేదా స్నేహం చేసే ముందు తనలో కొన్ని లక్షణాలు పరిశీలించాలి
ముఖ్యంగా 4 అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి
ఇతరులతో స్నేహం చేసినప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని గుడ్డిగా నమ్మవచ్చని చాణక్య నీతి చెబుతోంది.
చాణక్యుడి సిద్ధాంతం ప్రకారం మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఇతరుల పట్ల చెడు భావాలను కలిగి ఉండడు. అలాంటి స్నేహం మనకు భద్రతా భావాన్ని ఇస్తుందని చాణక్య నీతిలో చెప్పాడు.
కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, అబద్ధం వంటి చెడు లక్షణాలు లేని వ్యక్తులను మీరు నమ్మవచ్చు. ఎందుకంటే ఈ లక్షణాలు లేనివారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు.
ఒక వ్యక్తిని అంచనా వేయడానికి, ఆ వ్యక్తి చేసే పనులపై మీరు చాలా శ్రద్ధ వహించాలి. తప్పు చేసిన వారు సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం చేయడానికి వెనుకాడరు.