దీపావళి ఐదు రోజుల పండుగలో ఏ రోజు ప్రత్యేకత ఏంటి!



ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారంతా



ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుంచి కార్తీక శుద్ధ విదియ వరకూ ఐదురోజుల పాటూ సెలబ్రేట్ చేసుకుంటారు.



మొదటి రోజు ధన త్రయోదశి
ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. ఈ రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వాసం



రోజు నరక చతుర్దశి
ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశిగా జరుపుకుంటారు అంటే దీపావళి ముందు రోజు అన్నమాట.. ఈ రోజు నువ్వుల నూనె వంటికి పట్టించుకుని తలంటు పోసుకుంటే దోషాలు పోతాయని చెబుతారు.



మూడో రోజు దీపావళి అమావాస్య
ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండగ. సంధ్యా సమయంలో లక్ష్మీపూజ చేస్తారు. అనంతరం స్వీట్స్ తిన్నాక దీపాల వెలుగులతో ఇంటిని నింపేసి బాణసంచా వెలిగిస్తారు.



దీపావళి రోజులక్ష్మీపూజ చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తారు.



నాలుగో రోజు బలి పాడ్యమి
దీపావళి మర్నాడు బలిపాడ్యమి అని అంటారు. చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువుని పాతాళానికి అణిచివేసిన బలిచక్రవర్తి తిరిగి భూమ్మీదకి వచ్చిన రోజు అని చెబుతారు.



మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్‌’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. మరోవైపు శ్రీకృష్ణుడు గోవర్థనగిరినెత్తి రేపల్లె వాసులను కాపాడినదీ ఇదే రోజు అని చెబుతారు.



ఐదో రోజు యమ విదియ
దీపావళి నుంచి రెండోరోజు అంటే..కార్తీకమాసంలో రెండో రోజు వచ్చే విదియను యమవిదియ అంటారు. దీన్నే యమద్వితీయ అనికూడా అంటారు



ఈ రోజున సోదరుడికి స్వయంగా వండి వడ్డిస్తారు సోదరీమణులు. భోజనం పెట్టిన తర్వాత సోదరుడికి తన శక్తికొలది నూతన వస్త్రాలు అందించి ఆశీర్వదిస్తారు.



ఇలా మొత్తం ఐదు రోజుల పాటూ దీపావళి వేడుకలు జరుపుకుంటారు... ఈ ఏడాది (2023) దీపావళి నవంబరు 12 ఆదివారం వచ్చింది. Images Credit: Pinterest