ఇనుము శనికి చిహ్నంగా భావిస్తారు..అందుకే పండుగల సమయంలో..ముఖ్యంగా శనివారం రోజు ఇనప వస్తువులు కొనుగోలు చేయరు.
స్టీల్ పాత్రలు కొనుగోలు చేయకూడదు..దీని బదులుగా రాగి పాత్రలు కొనుగోలు చేయవచ్చు
జ్యోతిషశాస్త్రంలో, ధన్‌తేరస్ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు పదునైన వస్తువులు కొనుగోలు చేస్తే కుటుంబాన్ని దురదృష్టం వెంటాడుతుందని విశ్వసిస్తారు.
గాజు వస్తువులు రాహువుకు సంబంధించినవి కాబట్టి ధనత్రయోదశి రోజు గాజు వస్తువులు కొనుగోలు చేయడం అశుభం. అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులకు కూడా వద్దు
వేరే పాత్రలు ధనత్రయోదశి రోజు కొనుగోలు చేస్తే వాటిని ఖాళీగా ఇంట్లోకి తీసుకురాకూడదు. ఏవైనా గింజలు లేదా నీటితో నిండిన పాత్రని మాత్రమే తీసుకురావాలి.
ధనత్రయోదశి, శనిత్రయోదశి ఈ రోజు నూనె, నెయ్యి అస్సలు కొనుగోలు చేయరాదు. అంత అత్యవసరం అనుకుంటే ముందురోజే కొనుక్కోవడం మంచిది.
ధనత్రయోదశి రోజు బంగారం, వెండి కొనుగోలు చేయకపోయినా పర్వాలేదు కానీ నకిలీ బంగారం వస్తువులు కొనుగోలు చేయొద్దని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు..