భారత్ - చైనా బాణసంచాకి ఆద్యులెవరు చైనా వారు తుపాకి మందు కనిపెట్టడానికి ముందే భారత్ లో దానిని ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. చాణక్యుడి అర్థశాస్త్రం, శుక్రాచార్యుడి 'శుక్రనీతి'లో దీని గురించిన ప్రస్తావన ఉంది. అరబ్బులు, పర్షియన్లు తుపాకి మందు ఎలా తయారు చేయాలో భారతీయుల నుంచి నేర్చుకున్నారని చెబుతారు. నాఫ్తా అనే ద్రవరూప రసాయనం పోసిన బాణాలు, ఆయుధ ప్రయోగంలో సూరేకారం వాడేవారట. అంటే తుపాకీ మందు , అది ఉపయోగించే ఆయుధాలు తయాలు చేయడానికి ఆద్యులు భారతీయులే. సైనిక వేడుకల్లోనే కాకుండా ఇతర సమయాల్లోనూ భారతదేశంలో బాణసంచా కాల్చేవారనీ క్రీ.శ. 7వ శతాబ్దం నాటి చైనా సాహిత్యంలో ప్రస్తావించారు. బాణసంచా తయారీలో ప్రధానమైనది తుపాకి మందు. ఇది సూరేకారం, గంధకం, బొగ్గుల మిశ్రమం. గంధకం, బొగ్గు మందుగుండు ఎక్కువసేపు కాలడానికి దోహదం చేస్తే, సూరేకారం మిరమిట్లు గొలిపే ఎర్రటి కాంతులు విరజిమ్ముతుంది. Images Credit: Freepik