అన్వేషించండి

YS Jagan: లోకేష్ మోసపూరిత ప్రకటన, చంద్రబాబు ఆడియో లీకులతో మరో డ్రామా: గ్రూప్ 2 అంశంపై జగన్ ఫైర్

AP Group 2 Exam | తీవ్ర వివాదాల నడుమ ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఎగ్జామ్ వాయిదా వేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రకటించి, ఆడియో లీకులతో చంద్రబాబు అభ్యర్థులను మోసం చేశారని జగన్ ఆరోపించారు.

అమరావతి: ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, తాజాగా గ్రూప్ 2 అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఎదుర్కొన్న పరిస్థితే అందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ అంటోంది. గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేస్తానని మంత్రి లోకేష్ మోసపూరిత చేశారని, చివరికి మీ వాయిస్‌తో ఆడియోను లీక్‌ చేస్తూ మరో డ్రామా చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పలు అంశాలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

1. చంద్రబాబు.. నిరుద్యోగులను, ఉద్యోగులనే కాదు అన్నివర్గాల ప్రజలనూ మోసం చేయడమే అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు గ్రూప్‌-2 అభ్యర్థులనుకూడా నిలువునా మోసం చేశారు.

2. మూడు వారాలుగా గ్రూప్‌-2 అభ్యర్థుల అభ్యంతరాలను వింటున్నట్టు నటించి, వాటిని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేస్తున్నట్టు నమ్మబలికి, చివరకు వారిని నట్టేటా ముంచారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞాపనలను వింటున్నానని, తప్పకుండా పరిష్కారం చూపిస్తానని పరీక్షలకు రెండు రోజులముందు విద్యాశాఖమంత్రి, మీ కుమారుడు నారా లోకేష్ మోసపూరిత ప్రకటన చేశారు, మరోవైపు తాను చెప్పినా సరే, ప్రభుత్వం నుంచి లేఖ ఇచ్చినా సరే పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ ముందుకు వెళ్తోందని సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న మీ వాయిస్‌తో ఆడియోను లీక్‌ చేస్తూ మరో డ్రామా చేశారు. ఇంకోవైపు ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులతో లాఠీఛార్జి చేయించి అమానుషంగా ప్రవర్తించారు. ప్రజలను ఎలా మోసం చేస్తారో చెప్పడానికి ఇది మరొక ఉదాహరణ మాత్రమే. ఆఖరికి అయోమయం, గందరగోళం, అస్పష్టత మధ్యే పరీక్షలు పెట్టడం అత్యంత దారుణం.

3. మా ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి మెగా డీఎస్సీ పేరుతో ఇప్పటికీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కాలయాపన చేయడం  ఒక మోసమే.

4. ప్రతి జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ అని చెప్పి, అసలు దాని గురించి పట్టించుకోకపోవడం కూడా మీరు  చేసిన మోసమే.

5. వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చెప్పి, జీతం సంగతి దేవుడెరుగు చివరకు 2.6లక్షలమంది ఉద్యోగాలను ఊడగొట్టడమూ మోసమే.

6. గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది కుదింపు పేరిట, వీరిని వేరే డిపార్ట్‌మెంట్లకు సర్దుబాటు చేసి, అక్కడ ఖాళీలకు శాశ్వతంగా కోతపెట్టడమూ మోసమే.

7. నిరుద్యోగ భృతి అని, నెలనెలా రూ.3,000 అని, ప్రతి ఇంటినీ మోసం చేయడం, ఇంకో మోసం.

8. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టి ఇప్పుడు ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 18వేలమందిని, ఫీల్డ్‌ అసిస్టెంట్లనూ, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌లోనూ, ఏపీ ఎండీసీలోనూ, వైద్య ఆరోగ్య శాఖలోనూ పనిచేస్తున్నవారిని తొలగించి వారి జీవితాలను నడిరోడ్డుపై నిలబెట్టడము కూడా మీరు చేస్తున్న మోసాల్లో భాగమే.

9. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్న మీ హామీపై ఇప్పటికీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఉద్యోగులకు చేస్తున్న మోసమే.

10. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అంటూ  ఉన్న పీఆర్‌సీ ఛైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించి, కొత్త పీఆర్‌సీ ఇంతవరకూ వేయకపోవడమూ ఇంకో మోసమే.

11. ఒకటో తేదీనే జీతాలు అంటూ, ఒకే ఒక నెల మాత్రమే ఇచ్చి, ఆతర్వాత ప్రతినెలా ఉద్యోగులు ఎదురుచూసేలా చేయడం కూడా మీరు చేసిన మోసాల్లో భాగమే.

12. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 3 డీఏలు పెండింగ్‌లో పెట్టడం కూడా ఒక అన్యాయమే.

13. ట్రావెల్‌ అలవెన్స్‌లు, సరెండర్‌ లీవ్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌.. అన్నీ పెండింగ్‌లో పెట్టడంకూడా ఇంకో అన్యాయమే.

14. ఉద్యోగస్తులకు సంబంధించిన వారి జీఎల్‌ఐ, జీపీఎఫ్‌ కూడా మీ అవసరాలకు వాడేసుకుని ఉద్యోగులకు ఇబ్బందులు సృష్టించడం కూడా మీరు చేస్తున్న అన్యాయాల్లో భాగమే.

15. ఈ మోసాలకు, ఈ అన్యాయాలకు కేరాఫ్‌గా మారిన చంద్రబాబునాయుడుగారూ.. మీ వైఖరిపై ప్రజలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు ఎప్పుడూ మా పార్టీ తోడుగా నిలుస్తుంది.

Also Read: Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంలో కీలక పరిణామం, హైదరాబాద్ ORRను మించేలా మాస్టర్ ప్లాన్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
World Breastfeeding Week 2026 : బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
బిడ్డకు తల్లిపాలు ఎందుకు ముఖ్యం? పుట్టిన గంటలోపే ఎందుకు ఇవ్వాలి? లాభాలు, పోషకాలు ఇవే
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget