Pak vs Ind First Innings Highlights | Champions Trophy 2025 బౌలింగ్ తో పాక్ ను కట్టడి చేసిన భారత్
భారత్ పైన గెలిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ లో ముందడుగు వేయటం సాధ్యమయ్యే స్థితిలో టీమిండియాతో మ్యాచ్ కి దిగిన పాకిస్థాన్..అనుకున్నంత భారీ స్కోరు అయితే చేయలేకపోయింది. దుబాయ్ లో జరుగుతున్న గ్రూప్ A మ్యాచ్ లో టాస్ గెలిచిన బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ 49.4 ఓవర్లు అడి 241పరుగులు చేసి 10వికెట్లను కోల్పోయింది. భారత్ 242 పరుగుల టార్గెట్ పెట్టింది. ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ అంత ధాటిగా అయితే ఆడలేకపోయారు. మొదట్లో వైడ్ లు మీద వైడ్ లు వేసి భారత్ బౌలర్లు విసుగు తెప్పించినా సెకండ్ స్పెల్ లో చితక్కొట్టేశారు. 47పరుగులకే బాబర్ ఆజమ్ ను, ఇమామ్ ఉల్ హక్ ను అవుట్ చేశారు. బాబర్ ఆజమ్ 23పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో అవుట్ అయితే….ఇమామ్ ఉల్ హుక్ ను అక్షర్ పటేల్ రనౌట్ చేశాడు. అయితే ఆ తర్వాత సౌద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్ లు వికెట్ల పతనాన్ని ఆపారు. సౌద్ షకీల్ 62పరుగులు చేస్తే...రిజ్వాన్ 46పరుగులు చేశాడు. అక్షర్ పటేలే రిజ్వాన్ క్లీన్ బిల్డ్ చేసి పగ తీర్చుకున్నాడు. వందకు పైగా పరుగులు పెట్టిన పార్టనర్ షిప్ ను బ్రేక్ చేశాడు. చివర్లో ఖుష్దిల్ షా షమీ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టి 38పరుగులు చేయటంతో పాకిస్థాన్ 241పరుగులైనా చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3వికెట్లు తీయగా...పాండ్యా రెండు...హర్షిత్, జడ్డూ చెరో వికెట్ పడగొట్టారు. మరి పాకిస్థాన్ విసిరిన 241 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసి టీమిండియా 2017 నాటి ఛాంపియన్స్ ట్రోఫీ ఓటమికి బదులు తీర్చుకుంటుందేమో చూడాలి.





















