అన్వేషించండి

Makar Sankranti 2023: సంక్రాంతికి ఇంటిముందు ముగ్గుల్లో 'కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!

సంక్రాంతికి ప్రతి ఇంటి ముందూ కుండ ముగ్గు తప్పనిసరిగా ఉంటుంది. ఆ కుండలోంచి పొంగి కిందపడేలా రంగులు వేస్తారు. అసలు సంక్రాంతికి ఈ కుండకి ఏంటి సంబంధం..

Makar Sankranti 2023:  సంక్రాంతి సందడంతా ఓ లెక్క..పిండి వంటలు మరోలెక్క. ప్రతి పండుగకు ఆహారపదార్థాలు ప్రత్యేకమే అయినా సంక్రాంతికి పిండి వంటలు మరింత ప్రత్యేకం. నువ్వులు, కొత్త బెల్లం, చెరకు, రేగుపళ్ళు, కొత్త బియ్యం ( ప్రాంతాన్ని బట్టి కొన్ని వంటలు మారుతాయి)తో వంటకాలు చేస్తారు. వీటితో పాటూ వారి వారి ఆర్థికస్థితిని బట్టి భక్ష్యాలు, గారెలు, బూరెలు, కుడుములు, పులిహోర, పాయసం.. ఇలా ఇల్లంతా..ఇంకా చెప్పాలంటే ఊరంతా ఘుమఘుమలే.అన్ని పండుగల్లో సంప్రదాయ వంటలు ఉన్నప్పటికీ సంక్రాంతికి మాత్రం కొత్త కుండలో పొంగలి ప్రత్యేకం. అందులో పొంగలి అంటే కేవలం స్వీట్ కాదు..ఇల్లంతా సంతోషాన్ని పంచి, శుభం కలిగించే కమ్మని కుండ. 

Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఇన్ని కథలున్నాయా!

కుండ ఎందుకు!
సంక్రాంతి పండుగ సమయానికి పంట చేతికొచ్చి ధాన్యలక్ష్మి ఇంటికి చేరుతుంది. చెరకు కూడా విరివిగా కాస్తుంది. రేగుచెట్లు పళ్లతో కళకళలాడతాయి.  చెరకు పంట ఫ్యాక్టరీలకు చేరి బట్టిల్లో బెల్లం తయారవుతుంది. ఈ రోజున కొత్త కుండలో ఆవుపాలు, కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి, చెరుకును ఉంచి పాలు పొంగిస్తే ఏడాదంతా ఆ ఇంట్లో సిరులు, ఆనందం పొంగిపొర్లుతుందని విశ్వాసం.

తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాదితో మొదలైనప్పటికీ...పంట ఇంటికి చేరి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపే పండుగ మాత్రం సంక్రాంతి. ఆర్థికంగా కూడా ఆశాజనకంగా ఉండే సమయం. చలిగాలులు తగ్గి సూర్యుడి కిరణాల్లో వేడి పెరిగే కాలం .. అందుకే సంక్రాంతి అంతులేని సంబరాన్ని మోసుకొస్తుంది. అందుకే ప్రతిలోగిలిలో పొంగే కుండ ముగ్గు వేస్తారు. ఇంట్లో పాలు పొంగిస్తారు. ఆడపిల్లల సంబరమంతా ఇంటి ముంగిట్లో ముగ్గులోనే కనబడుతుంది. ఎంతో సృజనాత్మకతను వెలికి తీసే పండుగగా చెప్పుకునే సంక్రాంతి వేళ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులతో సంక్రాంతి లక్ష్మికి స్వచ్ఛంగా ఆహ్వానం పలుకుతారు. ముగ్గు మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు, గొబ్బెమ్మల మీద గుమ్మడి పూలు, బంతిపూలు, చామంతి పూలతో అలంకరిస్తారు. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ సంప్రదాయ దుస్తుల్లో ఆడపిల్లల ఆటపాటలు కన్నులపండువగా ఉంటాయి.  

Also Read: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!

కుండలు పంచుకునే సంప్రదాయం
కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగలో కుండలు పంచుకునే సంప్రదాయం కూడా పాటిస్తారు. ఆ కుండలో పొట్లకాయ, చెరకు, నువ్వుల బెల్లం, శనగపప్పు, పసుపు, కుంకుమ నింపి గిన్నె రూపంలో బహుమతిగా ఇస్తారు. మకర సంక్రాంతి నుంచి రథ సప్తమి వరకు ఇంటింటికి వెళ్ళి, పెద్దలు, ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమలతో తాంబూలాన్ని ఇచ్చే ఆచారం కూడా ఉంది. పండుక వేళ ఇంటికి వచ్చిన ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి నుదిటిన బొట్టుపెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలని చెబుతారు.  ఆనందాల సిరులు కురిపించే పొంగలి కుండ ఇంటి ముందు వేయడం ద్వారా ఆ ఇంట సిరులు పొంగుతాయని, ఇల్లంతా ఆనందాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. 

ఈ రోజు బ్రహ్మణులని ఆహ్వానించి  ఇంటిలో ఆసనం వేసి కాళ్లుకడిగి  నువ్వులతో నిండిన కంచుపాత్రలను దానం చేస్తారు కొందరు. ఈ పాత్రకు తిలా పాత్ర అని పేరు. వీలైతే రాగి పాత్రలు, ఇత్తడి కుందులు, గొడుగులు ఇవ్వవచ్చు. ఈ మకర సంక్రాంతి రోజు మట్టి కుండలలో పెరుగును నింపి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి, దీని వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంతానం ఉన్నవారు దానం చేస్తే ఆ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారని చెబుతారు. నందుని భార్య యశోద  బ్రాహ్మడికి పెరుగు దానం చేసినందువలనే శ్రీ కృష్ణుడు కొడుకుగా లభించాడు. ద్రోణాచార్యుని  భార్య కృపి దుర్వాసమహామునికి ఈ విధంగా కుండలో నింపిన పెరుగును దానం చేసినందువల్ల ఆమెకు అశ్వద్ధామ జన్మించాడని చెబుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Diwali Muhurat Trading 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
AP CM Chandrababu: ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
NTR Dragon Update: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
WhatsApp AI Image generation: WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
Advertisement

వీడియోలు

గంభీర్ వల్లే టీమిండియా ఓడింది: అశ్విన్
Riyaz encounter news Nizamabad | నిజామాబాద్ లో ఎన్ కౌంటర్..రౌడీ షీటర్ రియాజ్ మృతి | ABP Desam
గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి.. సెమీస్ ఆశలు లేనట్లేనా..?
ఆస్ట్రేలియాతో ఫస్ట్ వన్డేలో ఫెయిలైన కోహ్లీ, రోహిత్.. రిటైర్మెంటే కరెక్టేమో..!
వర్షం కాదు.. ఓవర్ కాన్ఫిడెన్సే ముంచింది
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Diwali Muhurat Trading 2025: కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
కౌంట్‌డౌన్ ప్రారంభం! నేటి ముహూరత్ ట్రేడింగ్‌లో రాకెట్‌లా దూసుకెళ్లే స్టాక్స్ ఇవే!
AP CM Chandrababu: ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
ఏపీలో ప్రజల భద్రత, నిఘా కోసం సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. పోలీసులపై ప్రశంసలు
NTR Dragon Update: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మధ్య గొడవలా? 'డ్రాగన్' షూట్ ఆగిందా? అసలు నిజం ఏమిటంటే?
WhatsApp AI Image generation: WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
WhatsAppలో కొత్త ఫీచర్.. AIతో ఫొటోలు క్రియేట్ చేసి స్టేటస్ పెట్టేయండి.. Step By Step Process ఇదే
PM Vishwakarma Yojana: తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్.. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు వీరే..
తక్కువ వడ్డీకే రూ.3 లక్షల వరకు లోన్.. పీఎం విశ్వకర్మ యోజన పథకానికి అర్హులు వీరే..
జీఎస్టీ కట్ తరువాత Tata Tiago లేదా Maruti Celerioలలో  ఏది చౌకగా లభిస్తుంది? బెస్ట్ ఫీచర్లు
జీఎస్టీ కట్ తరువాత Tata Tiago లేదా Maruti Celerioలలో ఏది చౌకగా లభిస్తుంది? బెస్ట్ ఫీచర్లు
Allu Arjun Diwali Celebrations: అల్లు వారి కుటుంబంలో దీపావళి సందడి... ఫోటోలు షేర్ చేసిన బన్నీ వైఫ్ స్నేహ
అల్లు వారి కుటుంబంలో దీపావళి సందడి... ఫోటోలు షేర్ చేసిన బన్నీ వైఫ్ స్నేహ
Nara Lokesh Australia Tour: ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన నారా లోకేష్
ఏపీ సీఫుడ్ పరిశ్రమకు సహకారం అందించాలని ఆస్ట్రేలియా ప్రతినిధులను కోరిన లోకేష్
Embed widget