అన్వేషించండి

Sri Rama Navami 2025: రామాయణం గురించి మీకు ఎంత తెలుసు..ఈ పరీక్ష రాసి ఎన్ని మార్కులొచ్చాయో చూసుకోండి!

Sri Rama Navami 2025: ఏప్రిల్ 06 ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రామాయణం గురించి మీకు ఎంతవరకూ అవగాహన ఉందో తెలుసుకునేందుకు చిన్న టెస్ట్ ఇది..

 Ramayana : రామాయణం గురించి కొన్ని ప్రశ్నలు - వాటి సమాధానాలు... మీకు తెలుసుకోవచ్చు.. పిల్లలకు నేర్పించవచ్చు..

1. శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
 వాల్మీకి

2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
నారదుడు

3. రామకథ విన్న తర్వాత వాల్మీకి  మధ్యాహ్న ఏ నదికి స్నానానికి వెళ్లారు?
 తమసా నది

4. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలున్నాయి?
 24,000.

5. శ్రీమద్రామాయణాన్ని గానం చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
 లవకుశలు

6. అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
 సరయూ నది

7. అయోధ్య ఏ దేశానికి రాజధాని?
కోసల రాజ్యం

8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
సుమంత్రుడు

9. దశరుథుని భార్యల పేర్లు?
కౌసల్య, సుమిత్ర, కైకేయి

10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
పుత్రకామేష్ఠి

11. యజ్ఞకుండం నుంచి దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎలా పంచారు?
కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు

12. బ్రహ్మదేవుని ఆవలింత నుంచి పుట్టిన వానరుడెవరు?
 జాంబవంతుడు

13. వాలి ఎవరి అంశతో జన్మించాడు?
  దేవేంద్రుడు ( ఇంద్రుడు)

14. వాయుదేవుడి వలన జన్మించిన వానరుడెవరు?
 హనుమంతుడు ( ఆంజనేయుడు)

15. కౌసల్య కుమారుని పేరేంటి?
 శ్రీరాముడు

16. భరతుని తల్లి ?
 కైకేయి

17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు?
 లక్ష్మణ, శత్రుఘ్నులు కవలలు- తల్లి సుమిత్ర

18. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు?
 వశిష్ఠుడు

19. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చేసరికి  రాముడి వయస్సు?
 12 సంవత్సరములు

20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
 మారీచ, సుబాహులు

21. రాముడికి అలసట, ఆకలి లేకుండా  విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేంటి?
 బల-అతిబల

22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
 సిద్ధాశ్రమం

23. తాటకి భర్త పేరు?
 సుందుడు

24. తాటకను శపించిన మహర్షి ఎవరు?
 అగస్త్యుడు

25. గంగను భూమికి తీసుకొచ్చేందుకు తపస్సు చేసిందెవరు?
 భగీరథుడు

26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది?
 జహ్ను మహర్షి  త్రాగివేయడం వల్ల
27. అహల్య భర్త ఎవరు?
 గౌతమ మహర్షి

28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
శతానందుడు

29. సీత ఎవరికి జన్మించింది?
 నాగటి చాలున తగిలి భూదేవి గర్భం నుంచి జన్మించింది

30. శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద ఉంచాడు?
 దేవరాతుడు.

31. శివధనుస్సును ఎవరు తయారు చేశారు?
 విశ్వకర్మ

32. భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
 మాండవి, శృతకీర్తి

33. లక్ష్మణుని భార్య ఊర్మిళ తండ్రి ఎవరు?
 జనకుడు

34. జనకుడి తమ్ముడి పేరు ?
కుశధ్వజుడు

35. పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేంటి?
 వైష్ణవ ధనుస్సు

36. భరతుని మేనమామ పేరు?
యధాజిత్తు

37. దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
 మంధర

38. కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడు ఎక్కడున్నాడు?
గిరివ్రజపురం, మేనమామ ఇంట్లో

39. రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
 శృంగిబేరపురం

40. వనవాసంలో భాగంగా సీతారాములు మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించారు?
 గారచెట్టు

41. శ్రీరాముని వనవాసానిక చిత్రకూట తగినదని సూచించిన ముని ఎవరు?
భారద్వాజ ముని

42. పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
మాల్యవతీ నది

43. భరతుడు వచ్చే వరకు 7 రోజులపాటు దశరథుని శవాన్ని ఎక్కడ భద్రపరిచారు?
తైలద్రోణంలో

44. శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జాబాలి

45. భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
నందిగ్రామము

46. అత్రిమహాముని భార్య ఎవరు?
అనసూయ

47. దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
విరాధుడు

48. పంచవటిలో ఉండమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
అగస్త్యుడు

49. పంచవటి ఏ నదీతీరంలో ఉది?
గోదావరి

50. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోశాడు?
శూర్ఫణఖ

51. 14 వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చారు?
 జనస్థానము

52. సీతను అపహరించుటానికి రావణుడు ఎవరి సహాయ కోరాడు?
 మారీచుడు

53. సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
 బంగారులేడి

54. సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం చేసిన పక్షి ఎవరు?
 జటాయువు

55. సీతను వెతుకుతున్న  రామలక్ష్మణులకు అరణ్యంలో మృగాలు ఏ దిక్కుకు సంకేతం చూపెను?
 దక్షిణపు దిక్కు

56. సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తంలో చిక్కుకున్నెనారు?
 కబంధుని

57.  సీతను వెతుకుతూ  రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో ఉంది?
 మతంగ వనం, పంపానదీ

58. సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివశించారు?
 ఋష్యమూక పర్వతం

59. రామలక్ష్మణుల గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపాడు?
 హనుమంతుడు

60. రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
 అగ్ని సాక్షిగా

61. రాముడు తన బాణాలు దేనితో తయారు చేశాడు - సుగ్రీవుడికి ఏం చెప్పాడు?
కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు

62. సుగ్రీవుని భార్య పేరు?
రుమ

63. వాలి భార్యపేరు?
తార

64. వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
 కిష్కింధ

65. వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేంటి?
మాయావి.

66. హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
దుందుభి

67. వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడింది?
మతంగముని

68. వాలి కుమారుని పేరేంటి?
అంగదుడు

69. రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షాలు భేదించాడు?
ఏడు

70. సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించారు?
ప్రసవణగిరి

71. సీతను వెతికేందుకు సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేన నాయకుడెవరు?
వినతుడు

72. సీతాదేవి కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
అంగదుడు

73. సీతమ్మ కోసం పశ్చిమ దిక్కుకు పంపిన సుషేణునికి...సుగ్రీవునితో బంధుత్వం ఏంటి?
మామగారు, తార తండ్రి

74. సీత కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
శతబలుడు

75. సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చాడు?
మాసం (ఒక నెల)

76. హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో ఉన్నాడు?
దక్షిణ దిక్కు

77. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతుడికి ఏమిచ్చాడు?
తన (రామ) పేరు చెక్కి ఉన్న ఉంగరం

78. హనుమంతుడు సహా వానరులు చిక్కుకున్న  లోయలో వున్న తాపసి పేరేంటి?
స్వయంప్రభ

79. సముద్రం ఆవల వున్న రావణుడిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేంటి?
సంపాతి

80. హనుమంతుడి తల్లి  అంజన అసలు పేరు?
పుంజికస్థల

81. ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరు?
మహేంద్రపర్వతం

82. వాయుపుత్రుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
మైనాకుడు

83. ఆంజనేయుడి శక్తిని పరీక్షించేందుకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేంటి?
సురస

84.  ఆంజనేయుడి నీడను ఆకర్షించి తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేంటి?
సింహిక

85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
నూరు యోజనములు

86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరు?
లంబ పర్వతం

87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
అశోక వనం

88. రావణుడు సీతకు ఎన్ని మాసాలు గడువిచ్చాడు?
రెండు

89. రాముడికి విజయం, రాక్షసులకు వినాశం తప్పదని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
త్రిజట

90. హనుమంతుడు చెట్టుపై ఉండి... సీతకు వినబడినట్లు ఎవరి కథ వినిపించాడు?
రామ కథ

91. రాముడికి నమ్మకం కలుగేందుకు  సీత నుంచి హనుమంతుడు తీసుకొచ్చిన ఆభరణం పేరేంటి?
చూడామణి

92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
ఎనభై వేలమంది

93. హనుమంతుడిని ఎవరి అస్త్రంతో బంధించి రావణుని వద్దకు తీసుకెళ్లారు?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం

94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
విభీషణుడు

95.  సీతను చూసొచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన వనం పేరేంటి?
మధువనం

96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చెప్పిందెవరు?
మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు

97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
ఆలింగన సౌభాగ్యం

98. సముద్రం దాటేందుకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానరుడి పేరేంటి
నీలుడు

99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించాడు?
నికుంభిల

100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రం ఉపదేశించిన ముని ఎవరు?
అగస్త్యుడు

101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
ఇంద్రుడు

102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
మాతలి

103. రావణ వధ తర్వాత లంకనుంచి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు మధ్యలో ఎక్కడ ఆగింది? 
 కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!

104.  గుహుడికి, భరతునికి తన రాక తెలియచేయమని శ్రీరాముడు ఎవర్ని ముందుగా పంపించాడు?
హనుమంతుడు

105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేంటి?
 శత్రుంజయం

106.  అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనం ఇచ్చారు?
రాముడు స్వయంగా తన భవనమునే ఇచ్చాడు

107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం తయారు చేసిందెవరు?
బ్రహ్మ

108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏంటి?
తన మెడలోని ముత్యాలహారం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Sixers vs SRH | IPL 2025 లో తొలిసారిగా మూడు సిక్సులు బాదిన రోహిత్ శర్మSun Risers Chennai Super Kings Points Table | IPL 2025 లో ప్రాణ స్నేహితుల్లా సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy CID investigation: రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్- ఆయనకు అన్నీ తెలుసు - సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Revanth Reddy Japan Tour:హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం
హైదరాబాద్‌లో AI డేటా సెంటర్ క్లస్టర్ -10,500 కోట్ల పెట్టుబడులకు ఎన్​టీటీ డేటా, నెయిసా అంగీకారం 
Weather Hyderabad: ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత-  హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌  
ఉదయం ఉక్కపోత- సాయంత్రం కుండపోత- హైదరాబాద్‌సహా తెలంగాణలో 3 రోజుల వెదర్ రిపోర్ట్‌
Lowest scores in IPL:ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
ఐపీఎల్‌లో లోయెస్ట్‌ స్కోరు ఆర్సీబీదే, వంద కంటే తక్కువ పరుగులు చేసిన జట్టేవి?
Tata Advanced Systems Limited:  టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ …  ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
టాటాలో ఉద్యోగాలు.డైరక్ట్ వాక్ ఇన్ … ఎప్పుడు.. ఎక్కడంటే.. ?
Viral News: నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
నారా లోకేష్ అపాయింట్‌మెంట్ కోసం 22 లక్షలు ఇచ్చా - కానీ అన్యాయం చేశారు - టీడీపీ కార్యకర్త పోస్ట్ వైరల్
Ramya Moksha Kancharla: అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
అలేఖ్య కాదు... రమ్య మోక్ష పికిల్స్... కమ్ బ్యాక్ అనౌన్స్ చేసిన చిట్టి చెల్లెలు
MMTS Rape Case : ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
ఎంఎంటీఎస్ రేప్ కేసు అంతా భోగస్ - నిజం చెప్పేసిన యువతి - అసలు జరిగింది ఇదీ !
Embed widget