అన్వేషించండి

Telangana New CS:తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!

Telangana Latest News:తెలంగాణలో సీఎస్‌ శాంతి కుమారి స్థానం రామకృష్ణారావును నియమిస్తారని టాక్ నడుస్తోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శికి మరో కీలక బాధ్యత అప్పగిస్తారని సమాచారం.

Telangana RTI Commissioner:తెలంగాణ  రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్‌ల ఎంపిక రేవంత్ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ (శనివారం, 5 ఏప్రిల్ 2025) ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. 

సెక్రటేరియట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఐ టీంతోపాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపికపైన కూడా చర్చ నడిచింది. ఆయా రంగాల్లో నిపుణులైన వారి పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. 

కొత్త బాధ్యల్లోకి శాంతి కుమారి

ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా మాత్రం శాంతికుమారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈ ఏడాది చివరికి ఆమె రిటైర్ కాబోతున్నారు. ఇంతలోనే ఆమెను ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా నియమించే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఆమె స్థానం కొత్త సీఎస్‌గా అందరి కంటే ముందు ఉన్న రామకృష్ణారావును నియమించబోతున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

కొత్త సీఎస్‌గా రామకృష్ణ
1989 ఐఏఎస్‌ బ్యాచ్​‌కు చెందిన శాంతి కుమారి ఏప్రిల్‌ 30న రిటైర్ కాబోతున్నారు. ఆమెను కేసీఆర్‌ 2023 జనవరి 11వ  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అప్పటి వరకు సీఎస్‌గా సోమేష్ కుమార్ ఉండే వాళ్లు. వాస్తవంగా సోమేశ్​ కుమార్ ఏపీకి కేటాయించిన ఉద్యోగి. అక్కడ పని చేయడం ఇష్టంలేకపోవడంతో తెలంగాణలోనే ఉంటానంటూ కోర్టులో పోరాడుతూ వచ్చారు. చివరకు అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో సీఎస్ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన స్థానంలో సీఎస్‌గా శాంతికుమారికి అవకాశం లభించింది.  కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆమెను మార్చకుండా కొనసాగించారు.  ఇప్పుడు ఆమె రిటైర్ కానుండటంతో ఆమెను ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌గా పంపిస్తారు. ఆమె స్థానం రామకృష్ణారావును నియమించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం రామకృష్ణ ఆర్థిక, ప్రణాళిక విభాగానికి స్పెషల్ చీఫ్‌ సెక్రటరీగా ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 10 బడ్జెట్‌లు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్, గుంటూరు కలెక్టర్‌గా సేవలు అందించారు. ఆయన కాన్పూర్, ఢిల్లీలోని  IITల్లో గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీలు పొందారు. 

రెండేళ్లుగా ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌ పదవి ఖాళీ

ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న ప్రధాన సమాచార కమిషన్ పదవీ కాలంలో ఫిబ్రవరితో ముగిసింది. ఇప్పటి వరకు కొత్త వ్యక్తులను నియమించలేదు. ఇప్పుడు దీనిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారీటీ రానున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఖాళీ అయిన సమాచార కమిషన్ సభ్యులను కమిషనర్‌ను రెండు నెలల్లో ఎంపిక చేయాలి. కానీ తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌ పదవీ కాలం 2023లోనే ముగిసింది. ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు. 

రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ ప్రధాన కమిషనర్ పదవులు భర్తీ చేయడానికి గతేడాదే తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. దీనికి వివిధ వర్గాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. చాలా మంది అప్లై చేసుకున్నట్టు సమాచారం. వాటిలో చాలా వరకు అధికారురు స్క్రూట్నీ చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఫైనల్ వడపోతకు శ్రీకారం చుట్టింది. ఈ పేర్లను ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget