Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
Waqf Amendment Bill:తీవ్ర చర్చల తర్వాత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లును రాష్ట్రపతి ఆమోదించారు. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ లో ఏముంది?

Waqf Amendment Bill: వాడీవేడి చర్చలతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ కొత్త చట్టాన్ని కాంగ్రెస్, AIMIM, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సుప్రీంకోర్టులో సవాలు చేశాయి.
ఈ కొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం, ఆక్రమణలు ఆపడానికి ప్రయత్నిస్తుందని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది. ఈ చట్టం ముస్లింలకు ఎంత మాత్రం వ్యతిరేకం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
President Droupadi Murmu gives assent to the Immigration and Foreigners Bill, 2025, which seeks to regulate the immigration, entry, and stay of foreigners in India.
— All India Radio News (@airnewsalerts) April 5, 2025
This Act repeals the Passport (Entry into India) Act, 1920, the Registration of Foreigners Act, 1939, the… pic.twitter.com/QKOhTH8cVr
ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో సహా ఆరు నెలల చర్చల తర్వాత చాలా సవరణలు అంగీకరించారు. అనంతరం రెండు సభల్లో ప్రవేశ పెట్టారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటు వేశారు. 95 మంది వ్యతిరేకించారు. లోక్‌సభలో 288 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే వ్యతిరేకంగా 232 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఈ చట్టం రాజ్యాంగ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల పట్ల వివక్ష చపుతోందని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘనకు పాల్పడుతోందని పిటిషన్లలో పేర్కొన్నారు.
కొత్త చట్టంపై ఆల్-ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు రోజుల నుంచి నిరసనలు తెలుపుతోంది. దేశవ్యాప్తంగా నిరసనలను చేపట్టాలని పిలుపునిస్తోంది. ప్రభుత్వం మాత్రం ఈ చట్టం వల్ల ముస్లిం మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని వాదిస్తోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత ఉంటుందని పేర్కొంది.
అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, వక్ఫ్ (సవరణ) చట్టం, 2024, అనేక నిర్మాణాత్మక సంస్కరణలను ప్రవేశపెడుతుంది, వాటిలో ఉన్న విషయాలు ఇవే:
- రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో పస్మాండా, పేద ముస్లింలకు తప్పనిసరి ప్రాతినిధ్యం.
- వక్ఫ్ ఆస్తుల నమోదు, రక్షణ, వినియోగం కోసం కఠినమైన నిబంధనలు.
- ప్రత్యేక వక్ఫ్ ట్రైబ్యునళ్ల ద్వారా ఆక్రమణ కేసులను సకాలంలో పరిష్కరించడం.
- ఆడిట్, వాబుదారీతనం విధానాలు, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడంతోపాటు వక్ఫ్ బోర్డుల వార్షిక ఆడిట్‌లను తప్పనిసరి చేయడం.
- వక్ఫ్‌గా ఆస్తులను “ధృవీకరించని లేదా మోసపూరిత నమోదు”పై నిషేధం.
- వక్ఫ్‌బోర్డుల కూర్పును విస్తరించడానికి, పర్యవేక్షణను బలోపేతం చేయడానికి పాత చట్టంలోని సెక్షన్ 14 సెక్షన్ 32ను సవరించింది. ఈ సవరణ “వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను తీసుకురానుందని తెలిపింది. నిజమైన వక్ఫ్ లబ్ధిదారుల ప్రయోజనాలను కాపాడటం, అణగారిన ముస్లిం వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం” లక్ష్యంగా పెట్టుకుందని గెజిట్ మరింత పేర్కొంది.
ఈ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) చైర్మన్, బిజెపి ఎంపి జగదాంబికా పాల్ మాట్లాడుతూ, "ఒక చారిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. పేదలు, పస్మాండ ముస్లింలు దీని ద్వారా భారీగా ప్రయోజనం పొందుతారు. కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. పేదలు, పస్మాండ ముస్లింలకు వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లభిస్తుంది. బిల్లు చాలా పారదర్శకంగా ఉంది. వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం చేస్తున్నారు. పేదలకు ప్రయోజనాలు అందలేదు " అని అన్నారు.





















