Waqf Bill YSRCP: Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
Rajyasabha: వక్ఫ్ బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ వ్యతిరేకంగా ఓటేయలేదన్న వాదన వినిపిస్తోంది. పోలైన ఓట్లకు.. వ్యతిరేకంగా పడిన ఓట్లకు పొంతన ఉండటం లేదు.

YSRCP did not vote against Waqf Bill: వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని వైఎస్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ప్రసంగించారు. దీంతో ఆ పార్టీకి ఇప్పటికీ ఉన్న ఏడుగురు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తారని అనుకున్నారు. కానీ తీరా ఓటింగ్ కు వచ్చే సరికి జరిగింది వేరన్న విశ్లేషణలు వస్తున్నాయి.
రాజ్యసభ మొత్తం సభ్యులు 245 - ఖాళీలు 9
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. ఇందులో తొమ్మిది ఖాళీగా ఉన్నాయి. అందులో జమ్మూకశ్మీర్ నుంచి నాలుగు , ఏపీ నుంచి ఒకటి, నాలుగు నామినేటెడ్ సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలం 236. వక్ఫ్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 223 మంది మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన పదమూడు మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు.
ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం వచ్చిన ఓట్లు 128
రాజ్యసభలో ఎన్డీఏకు 125 మంది సభ్యుల బలం ఉంది. కానీ ఓటింగ్ లో 128 ఓట్లు వచ్చాయి. అంటే మూడు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. అంటే ఇతర పార్టీల నుంచి మూడు ఓట్లు ఎక్కువగా వచ్చాయి.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఏడు ఓట్లు ఎక్కువ
యూపీఏ పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య 88. కానీ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చిన ఓట్లు మాత్రం 95. ఏడు ఓట్లు ఎక్కువగా వచ్చాయి. బిజూ జనతా దళ్ పార్టీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ విప్ జారీ చేయలేదు. ఆ పార్టీకి ఏడు ఓట్లు ఉన్నాయి. ఆత్మ ప్రబోదానుసారం ఓటేసుకోవాలని ఎంపీలకు సూచించారు. దీంతో బీజేడీకి చెందిన ముస్లిం సభ్యుడు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కూడా ఓటేయడంతో 95 వరకూ వ్యతిరేకించిన వారి ఓట్లు వచ్చాయి.
సైలెంట్ గా ఓటింగ్ బహిష్కరించిన వైసీపీ ఎంపీలు
రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. అంటే 236 మంది ఓటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ 223 మంది పాల్గొన్నారు. వైసీపీ సభ్యులు కొంత మంది వక్ఫ్ కు మద్దతుగా ఓటేశారు.. లేకపోతే బీజేపీకి ఇబ్బంది లేకుండా ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. బీజేడీకి ఏడు మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరిద్దరు వక్ఫ్ బిల్లుకు సపోర్టు చేశారు. అన్నాడీఎంకే ముగ్గురు ఉన్నారు బాయ్ కాట్ చేశారు.ఇలా ఏ విధంగా చూసినా వైసీపీ ఎంపీల ఓట్లు మాత్రం లెక్కలోకి రావడంలేదు. పార్లమెంట్ ప్రసంగంలో తాము వ్యతిరేకిస్తామని ప్రకటించి వక్ఫ్ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండటంతో .. వైసీపీ తీరుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.
బిల్లును వ్యతిరేకించినట్లుగా ప్రకటించి ఓటింగ్ కు దూరంగా ఉంటే అది చిన్న విషయం కాదు. ది. వైసీపీకి ముస్లింలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తామని జగన్ మొదటి నుంచి ప్రకటిస్తున్నారు. అనుకూలంగా ఓటు వేయకపోయినా.. బాయ్ కాట్ చేసినా పరోక్షంగా వక్ఫ్ బిల్లుకు సపోర్టు చేసినట్లు అవుతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

