Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ - విజయ్ సేతుపతి మూవీలో బాలీవుడ్ హీరోయిన్? - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?
Puri Jagannadh: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీపై భారీ హైప్ నెలకొంది. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కీలక రోల్ కోసం బాలీవుడ్ నటి టబును టీం సంప్రదించినట్లు తెలుస్తోంది.

Latest Buzz Viral On Puri Jagannadh Vijay Sethupathi Movie: డేరింగ్ అండా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh), తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబోలో ఓ మూవీ రాబోతోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ మూవీపై పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన వచ్చింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే బజ్ నెలకొనగ నటీనటులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
సినిమాలో ఆ బాలీవుడ్ హీరోయిన్!
లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి టబును మూవీ టీం సంప్రదించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్టార్ నటీనటులు ఈ మూవీలో భాగం అవుతుండడంతో స్టోరీపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ హీరోతో పూరీ ఎలాంటి కాన్సెప్ట్ తీయబోతున్నారో అనేది ఆసక్తిగా మారింది. దీనిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు, ఇతర వివరాలను ప్రకటిస్తామని టీం పేర్కొంది.
అసలు స్టోరీ ఏంటో?
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'మహారాజా'తో (Maharaja) బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అలాగే 'విడుదల పార్ట్ 2'లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. తెలుగులో 'ఉప్పెన' తర్వాత ఆయన ఏ మూవీ చేయలేదు. చాలామంది దర్శకులు స్టోరీస్‌తో వెళ్లినా ఆయన ఓకే చెప్పలేదు. అయితే, పూరీ చెప్పిన కథకు మాత్రం సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చెప్పేశారని తెలుస్తోంది. మరి ఎలాంటి స్టోరీ చెప్పారో అనే బజ్ మూవీ ప్రకటన సమయంలోనే అందరిలోనూ నెలకొంది.
పూరీ కమ్ బ్యాక్ ఖాయమేనా..
పూరీ జగన్నాథ్.. ఒకప్పుడు మాస్ డైరెక్టర్‌గా టాలీవుడ్ టాప్ హీరోలతో మూవీస్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో పోకిరి, ఎన్టీఆర్ 'టెంపర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టాయి. పూరీ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్.. స్టోరీ మేకింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. తక్కువ టైంలోనే సినిమాను పూర్తి చేసి మంచి హిట్స్ సాధిస్తారని ఆయనకు పేరుంది. ఇటీవల కాలంలో పూరీ జగన్నాథ్ ట్రెండ్‌కు కాస్త బ్రేక్ పడింది. ఆయన నుంచి సరైన హిట్ పడలేదు.
వరుస అపజయాల అనంతరం 2019లో యంగ్ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్ శంకర్' మూవీ తెరకెక్కించగా మళ్లీ హిట్ అందుకున్నారు. అయితే, ఆ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన విజయ్ దేవరకొండ లైగర్ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇదే టైంలో రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమా సైతం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కింగ్ నాగార్జునతో, గోపీచంద్ గోలీమార్ సీక్వెల్ తీస్తారని ప్రచారం జరిగినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో విజయ్‌తో మూవీ స్టార్ట్ కాబోతుండడంతో మళ్లీ పూరీ హిట్ కొట్టాలని ఆయన ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ కావాలని అంటున్నారు.






















