Kumbh Mela : నో వెహికల్ జోన్‌గా ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాకు వచ్చే భక్తులకు కొత్త ఆంక్షలు ఇవే!
Magh Purnima 2025: ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి సందర్భంగా మాహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలిరానున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు

Maha Kumbh Magh Purnima: కుంభమేళా పూర్తవుతోంది..మిగిలిన 15 రోజుల్లో మాఘపూర్ణమి, మహా శివరాత్రి అత్యంత ప్రత్యేకం. ఈ సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరించే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. ఇప్పటికే మౌని అమావాస్య రోజు భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు.
ఫిబ్రవరి 11 మంగళవారం మధ్యాహ్నం నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్చేశారు. వీకెండ్ అయిన ఫిబ్రవరి 8,9 తేదీల్లో పుణ్యస్నానాలకు తరలివచ్చే భక్తుల రద్దీ ఓ రేంజ్ లో ఉంటోంది. ఆయా మార్గాల్లో 24 గంటలు, 48 గంటల పాటూ వాహనాలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా జబల్‌పుర్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో జాతీయరహదారిపై సుమారు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్‌గా నిలిచింది.
Also Read: కుంభమేళా కి కౌంట్ డౌన్.. ఎలాంటి కష్టం లేకుండా వెళ్లి వచ్చేయాలి అనుకుంటే ఇలా చేయండి!
వీకెండ్ ఎఫెక్ట్ ట్రాఫిక్ రద్దీ ఇప్పుడిప్పుడే కంట్రోల్ అవుతోంది..ఇంతలోనే ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ. ఈ సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఈ వారం కూడా తప్పవు. అందుకే భక్తులు పరిస్థితిని అర్థం చేసుకుని ముందుగు సాగాలని, వచ్చేవారు రద్దీని గుర్తుపెట్టుకుని రావాలని ముందస్తుగానే అధికారులు హెచ్చరించారు. గంట పట్టే ప్రయాణం ప్రస్తుత పరిస్థితుల్లో పది నుంచి 12 గంటలు పట్టేస్తోందని ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్న ప్రయాణికులు వాపోతున్నారు
మాఘ పౌర్ణమి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పోలీసులు, అధికారులతో సమావేశమయ్యారు. వాహనాల రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు కొందరు భక్తులు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మాఘపౌర్ణమికి ఏర్పాట్లు చేయాలన్నారు.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
భక్తులు సులభంగా స్నానం చేసేందుకు ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల నుంచి మొత్తం మేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. ఫిబ్రవరి 11న సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రయాగరాజ్ నగరంలోనూ నో వెహికల్ జోన్ అమల్లో ఉంటుందన్నారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. ఈ ఆంక్షలు ఫిబ్రవరి 12 కుంభమేళాలో భక్తుల రద్దీ తగ్గేవరకూ అమల్లో ఉంటాయి.
ట్రాఫిక్‌లో జాప్యం నిర్వహణలో లోపం వల్ల కాదని..కేవలం కుంభమేళాలో తరలివచ్చే భక్తుల సంఖ్యే కారణం అని ఉత్తర ప్రదేశ్ DGP ప్రశాంత్ కుమార్ స్పష్టం చేశారు. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యాత్రికుల రద్దీ ఉండటం వల్లనే ఇంత ట్రాఫిక్ జామ్ అవుతోందని వార్తాసంస్థ PTI తో చెప్పారు. జనవరి 13 మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఫిబ్రవరి 10 వరకూ 40 కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే పవిత్ర సంగమంలో స్నానమాచరించారని అధికారుల అంచనా.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

