Maha Kumbh End Date 2025: కుంభమేళా కి కౌంట్ డౌన్.. ఎలాంటి కష్టం లేకుండా వెళ్లి వచ్చేయాలి అనుకుంటే ఇలా చేయండి!
Suggestions For Maha Kumbh Tourists: కుంభమేళాకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో రెండు వారాల్లో ముగిసిపోతుంది. ఈ లోగా త్రివేణి సంగమంలో స్నానమాచరించాలి అనుకుంటే ఇలా చేయండి....

Maha Kumbh End Date 2025: జనవరి 13 భోగి రోజు ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగిసిపోతుంది. ఇప్పటికే దాదాపు నెల రోజులు గడిచిపోయింది. ఇక 15 రోజులు మాత్రమే ఉంది. ఆరంభంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆగిపోయినవారంతా.. ఆఖరి రెండువారాల్లో వెళ్లాలి అనుకుంటారు. అయితే మీ కోసమే ఈ సూచనలు.
ఇప్పటివరకూ కుంభమేళాకు స్వయంగా వెళ్లి త్రివేణి సంగమంలో స్నానమాచరించి వచ్చిన భక్తులు షేర్ చేసుకున్న వివరాలివి. మీకు చాలా ఉపయోగపడతాయి..
కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు హరించుకుపోయి..మరో జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే కుంభమేళాలో స్నానమాచరించి..పితృదేవతలను స్మరించుకుంటారు. పుణ్యం కోసం చేసే ఈ ప్రయాణం సంతోషంగా గుర్తుండిపోవాలి.
Also Read: మాఘ పూర్ణిమ ప్రత్యేకత ఏంటి..ఈ ఏడాది ఎప్పుడొచ్చింది.. ఈ రోజు సముద్ర స్నానం ఎందుకు చేయాలి!
టీవీల్లో, పేపర్లలో చూపినంత క్రౌడ్ కుంభమేళా దగ్గర లేదంటున్నారు కొందరు భక్తులు. టీవీల్లో చూపిస్తున్న క్రౌడ్ విజువల్స్ నిజం కాదా అంటే.. నిజమే...అవన్నీ కేవలం సంగం ఘాట్ దగ్గరవి మాత్రమే. సంగం ఘాట్ కాకుండా చాలా ఘాట్స్ ఉన్నాయి...అక్కడ పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సంఖ్య తక్కువే ఉంది. అందుకే మీరు సంగం ఘాట్ కి కాకుండా మిగిలిన ఘాట్ లకు వెళ్లడం మంచిది
ప్రయాగ రాజ్ లో మొత్తం 41 ఘాట్ లు ఏర్పాటు చేశారు. ఏ ఘాట్ నుంచి అయినా త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేందుకు బోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి 400 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు..భక్తుల రద్దీని బట్టి ఈ ఛార్జ్ పెరుగుతుంది.
Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!
కుంభమేళాకి వెళ్లేవారు కనీసం 10 కిలోమీటర్లు నడిచేందుకు సిద్ధపడండి. ఎందుకంటే సంగం ఘాట్ దగ్గరకు వాహనాలను అనుమతించడం లేదని ముందునుంచీ చెప్పుకుంటున్నాం. అక్కడివరకూ వెళ్లాలంటే కిలోమీటర్లు నడవాల్సిందే. ముఖ్యంగా ఫుడ్ గురించి టెన్షన్ పడొద్దు. ఎక్కడికక్కడ ఉచితి టిఫిన్లు ఇస్తున్నారు...చాలా కంపెనీలు స్టాల్స్ పెట్టి అమ్ముతున్నారు.
సంక్రాంతి సమయంతో పోలిస్తే రథసప్తమి తర్వాత చలి బాగా తగ్గింది. కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సింగిల్ గానో, ఫ్రెండ్స్ తోనో వెళితే పర్వాలేదు కానీ... చిన్నారులు, పెద్దోళ్లని తీసుకెళ్తే మాత్రం ముందుగానే అకామిడేషన్ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. రిటర్న్ జర్నీ విషయంలోనూ ఎలాంటి కంగారు అవసరం లేదు. నాగపూర్ వరకూ వెళ్లినా అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ఈజీగా చేరుకోవచ్చు. ట్రైన్లో వెళ్లేవారు మాత్రం రష్ విషయంలో ముందుగానే ప్రిపేర్ అవండి.
సెక్టార్ త్రీలో మహాకుంభ డిజిటల్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్, నాగసాధులు ఉండే సెక్టార్ , టెంట్ సిటీ చూసి వస్తే మీకు మాహా కుంభమేళా యాత్ర గుర్తుండిపోతుంది.
కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌రాజ్ దారులన్నీ నిండిపోతున్నాయ్. ప్రయాగ్‌రాజ్-కాన్పుర్, ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్-వారణాసి-మిర్జాపుర్, ప్రయాగ్‌రాజ్-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో వాహనాల రద్దీ కొనసాగుతోంది. రోజుల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ రష్ గురించి సోషల్ మీడియాలో వరుస పోస్టులు, వీడియోస్ పెడుతున్నారు నెటిజన్లు.
Also Read: ఒకటి 'మహా శ్మశానం' , మరొకటి 'మనో శ్మశానం' - ఈ క్షేత్రాల్లో అడుగుపెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

