అన్వేషించండి
In Pics: హైదరాబాద్‌లో టీ కాంగ్రెస్ భారీ ర్యాలీ, ఈడీ ఆఫీసు ఎదుట నిరసనలు - చాలాచోట్ల ట్రాఫిక్ జామ్

ర్యాలీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటోలు)
1/8

రాహుల్‌గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం ఎదుటకు చేరుకుంది.
2/8

ఢిల్లీ ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకు నిరసనలు చేయాలని అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలోనూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభం అయింది.
3/8

మరోవైపు ర్యాలీ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
4/8

ఖైరతాబాద్ జంక్షన్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీ క పూల్, బషీర్ బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ జంక్షన్, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సెక్రెటేరియట్ మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను దారి మళ్లించారు.
5/8

మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.
6/8

ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాస్కి, జగ్గారెడ్డి సహా అందరు కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
7/8

అక్కడ కాంగ్రెస్ జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నల్ల బట్టలు, నల్ల కండువాలు ధరించారు.
8/8

జగ్గారెడ్డి ఏకంగా సోనియా గాంధీ విగ్రహం ఎక్కి నిరసన తెలిపారు. వీరంతా అక్కడ నుంచి బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు.
Published at : 13 Jun 2022 01:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion