అన్వేషించండి
Advertisement

Kothaguda Flyover Photos: ఐటీ కారిడార్‌లో కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం, ట్రాఫిక్ సమస్యలకు సర్కార్ చెక్
Kothaguda Fly Over: ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఐటీ కారిడార్‌లో కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం
1/9

ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ క్ సమస్యలు, సిగ్నల్ లేని ప్రయాణం సాగించేలా కొత్త సంవత్సరం కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త ఫ్లైఓవర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
2/9

ఐటీ కారిడార్ కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్ పాస్ లను మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రారంభించారు.
3/9

ఈ కొత్త కారిడార్ తో ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసే వీలు ఉంటుంది.
4/9

గచ్చిబౌలి నుంచి ఆల్విన్ కాలనీ కూడలి వైపు వన్ వే ఫ్లైఓవర్ గా ఇది అందుబాటులోకి వచ్చింది.
5/9

గచ్చిబౌలి నుంచి వచ్చే వాహనాలు, మసీద్ బండా, బొటానికల్ గార్డెన్ నుండి వచ్చే వాహనాలు ఈ కొత్త ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తాయి.
6/9

ఈ ఫ్లైఓవర్ మీది నుంచి మాదాపూర్, హఫీజ్ పేట్ వైపు వెళ్లవచ్చు. శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్ల వల్ల ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
7/9

మాదాపూర్, కొండాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు సాగించవచ్చు.
8/9

కొండాపూర్ బొటానికల్ గార్డెన్, కొత్తగూడ కూడళ్లలో ట్రాఫిక్ తగ్గనుంది. ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు సిగ్నల్ ప్రయాణం సులభం కానుంది.
9/9

మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి వైపు వెళ్లే వారు ట్రాఫిక్ లో చిక్కుకోకుండానే ఇకపై రాకపోకలు సాగించే అవకాశం రానుంది.
Published at : 01 Jan 2023 06:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విజయవాడ
ఇండియా
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion