Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు
Fertilizer Subsidy Increased: కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సరం రోజున రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువులపై రాయితీ ప్రకటించింది.
Fertilizer Subsidy: కొత్త సంవత్సరం తొలి రోజే కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. తొలి కేబినెట్ సమావేశంలో రైతులకు సంబంధించిన కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో డీఏపీ ఎరువులు తయారు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించింది. దీంతో రైతులు డీఏపీకి అధిక ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఎరువులపై అధిక సబ్సిడీ ఇవ్వనుంది కేంద్రం.
డీఏపీ ఎరువుల తయారీదారులకు ఉపశమనం కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారికి సబ్సిడీతోపాటు ఆర్థిక సాయం అందించేందుకు కూడా ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడం, రైతులకు ఆర్థిక సహాయం అందించడంతోపాటు అవసరమైన ఎరువులను సరసమైన ధరలకు అందించడం ఈ నిర్ణయాల లక్ష్యం.
అందుకే జనవరి 1నే కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దంతో ఇప్పుడు రైతులకు 50 కిలోల డిఎపి బ్యాగ్‌ను రూ.1350కి రానుంది. దీనికి అయ్యే అదనపు ఖర్చులను కేంద్రం భరించనుంది. దీని కోసం డీఏపీ కంపెనీలకు రూ.3850 కోట్ల సబ్సిడీని భారత ప్రభుత్వం ఇస్తుంది.
డీఏపీ ప్యాకేజీ ఒక సంవత్సరంపాటు వర్తిస్తుంది అంటే దీని ప్రయోజనాన్ని 31 డిసెంబర్ 2025 వరకు పొందవచ్చు. DAP ఎరువుల తయారీదారులకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ఈ ప్యాకేజీని ఆమోదించింది.
కేంద్ర క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.69515 కోట్లకు పెంచుతూ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. దీని వల్ల 4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. చిన్న రైతులు ఫసల్ బీమా యోజన ప్రయోజనం పొందుతున్నారు. ఈ ఫసల్ బీమా పథకాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామన్నారు.
రైతుకు ఇస్తున్న పంటల బీమా పథకాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పంటల బీమా పథకాన్ని సులభతరం చేసేందుకు, దాని నియమాలు, నిబంధనలను సవరిస్తామన్నారు. 2025 సంవత్సరానికి సంబంధించిన మొదటి కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగింది, ఇందులో ప్రధాన నిర్ణయాలు తీసుకున్నారు.
DAP అంటే ఏమిటి
DAP అంటే డి-అమ్మోనియం ఫాస్ఫేట్, ఇది పంటలకు భాస్వరం, నత్రజని అందిస్తుంది. DAP అనేది అమ్మోనియా, ఫాస్పోరిక్ ఆమ్లం ప్రతిచర్య నుండి తయారైన నీటిలో కరిగే ఎరువులు. రైతులకు ఇది ఒక ప్రధానమైన ఎంపిక ఎందుకంటే ఇది వేగంగా కరిగిపోతుంది. పోషకాలలో అధికంగా ఉంటుంది.
మోదీ హర్షం
కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపారు. అందుకే మొదటి మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు.
The Cabinet decision on extending the One-time Special Package on Di-Ammonium Phosphate will help our farmers by ensuring DAP at affordable prices. https://t.co/KU0c8IYCXV
— Narendra Modi (@narendramodi) January 1, 2025