Aamir Khan: థియేటర్లకు ప్రేక్షకులు రాకుండా చేశారు... ఆమిర్ షాకింగ్ కామెంట్స్... సౌత్ సినిమాలపై కూడా!
Aamir Khan On OTT: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఓటీటీ రిలీజ్, సౌత్ సినిమాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేసింది తామేనని అన్నారు.

థియేటర్లలో విడుదల అయిన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలలో విడుదల చేసేటట్టు అయితేనే పివిఆర్ ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. లేదంటే మరో ఆలోచన లేకుండానే ఆయా సినిమాలను పక్కన పెట్టేస్తున్నాయి. ఎనిమిది వారాలలో ఓటీటీలోకి ఫ్రీగా చూసే అవకాశం ఉన్నప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు ఎలా వస్తారని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రశ్నించారు.
సినిమా వ్యాపారాన్ని మేమే చంపేశాం!
''గతంలో నేను థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవాడిని. ఎందుకు? అంటే... నాకు మరొక ఆప్షన్ లేదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అందుకని జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారు'' అని ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రేక్షకుడికి సినిమాను రెండు సార్లు ఎలా అమ్మాలో తమకు తెలియడం లేదని అర్థం వచ్చేలా ఆయన మాటలు సాగాయి. పరోక్షంగా ఓటీటీ ప్రభావం ఎంత ఉందనేది ఆయన స్పష్టంగా చెప్పారు.
Also Read: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టిన రోజు... ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా
''థియేటర్లలో సినిమా చూడమని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేస్తాం. ఒకవేళ థియేటర్లకు రాలేదనుకోండి... ఎనిమిది వారాలలో ఓటీటీలోకి తమ సినిమాను తీసుకు వస్తామని చెబుతాం. అది కూడా ఎటువంటి టికెట్ రేటు లేకుండా! ఫ్రీ ఆఫ్ కాస్ట్... ఆల్రెడీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటారు కనుక అందులో సినిమాను ఫ్రీగా చూడొచ్చు. ఒక సినిమా రెండు సార్లు ఎలా అమ్మాలో నాకు తెలియడం లేదు'' అని అమీర్ ఖాన్ అన్నారు.
మూడు నాలుగు నెలల గ్యాప్ మంచిది!
Aamir Khan Birthday: మార్చి 14న ఆమిర్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పివిఆర్ ఐనాక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. 'ఆమిర్ ఖాన్: సినిమా కా జాదూగర్' పేరుతో ఆయన హిట్ సినిమాలను ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ రచయిత - లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా పాల్గొన్నారు. థియేటర్లలో విడుదలైన మూడు లేదా నాలుగు నెలల తర్వాత ఓటీటీలలోకి సినిమాలను తీసుకు రావడం మంచిదని అప్పుడు థియేట్రికల్ బిజినెస్ బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు లీకుల బెడద... సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు
సౌత్ సినిమాలపై ఆమిర్ ఖాన్ కామెంట్స్!
సౌత్ సినిమాల గురించి కూడా ఆమిర్ ఖాన్ కామెంట్స్ చేశారు. ''ప్రేమ, కోపం, పగ వంటి అంశాల మీద మేం ఫోకస్ చేయడం లేదు. వాటిని ప్రధాన అంశాలుగా తీసుకొని దక్షిణాది దర్శక నిర్మాతలు హీరోలు ఏ విధంగా అయితే సినిమాలు చేస్తున్నారో మేం కూడా అలా చేయాలి. సౌత్ సినిమాలను సింగిల్ స్క్రీన్ సినిమాలని, ఊర మాస్ సినిమాలని అంటుంటాం. బహుశా బాలీవుడ్ మల్టీప్లెక్స్ మూవీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుంది'' అని ఆమిర్ ఖాన్ చెప్పారు.
Also Read: మళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా





















