అమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్ అనుచరులేనా?
అమెరికాలో తెలుగువారి పరువు తీస్తున్నారంటూ కొంత మంది యువకులకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వారంతా ముఠాగా ఏర్పడి తెలుగువాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ దందాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దుకాణాలు, హోటల్స్ రూల్స్ పాటించడం లేదని వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలంటూ నిర్వాహకులకు బెదిరింపులకు దిగారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో తెలుగు రెస్టారెంట్లు, షాపులు టార్గెట్ చేసి తూనికలు సరిగా లేవంటూ బెదిరిస్తూ లక్ష డాలర్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్న యువకులు కేటీఆర్ అనుచరుడు అంటూ సోషల్ మీడియాలో మరో ప్రచారం మొదలైంది. అంతేకాకుండా, అతను బండి సంజయ్ కు కూడా సన్నిహితుడని ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు.