అన్వేషించండి

Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం

Andhra Pradesh News | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు లబ్ది చేకూర్చేలా తొలి సంతకం చేశారు. సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల ఫైలుపై చంద్రబాబు సంతకం చేశారు.

AP CM Chandrababu first sign in 2025 | అమరావతి: నూతన సంవత్సరం 2025 తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ది చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ (AP CMRF) నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ. 24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి.

ఏడు నెలల్లో పేదలకు రూ. 120 కోట్లకు పైగా లబ్ధి

గత ఏడాది జూన్‌లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ. 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదలకు ఇచ్చారు. 7,523 మందికి లబ్ది కలిగింది. బుధవారం నాడు సీఎం చంద్రబాబు తాజాగా చేసిన సంతకంతో ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ కోసం విడుదల చేసిన నిధుల మొత్తం రూ. 124.16 కోట్లకు చేరింది. కూటమి ప్రభుత్వంలో మొత్తంమ్మీద 9,123 మంది సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రయోజనం పొందినట్లయ్యింది. 

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త రెడీ!

నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ప్రచారంలో ఉంది.  పీఆర్సీతో పాటు ఉద్యోగులకు మధ్యంతర భృతిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జనవరి 2న గురువారం నాడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో ఉద్యోగుల డీఏ, పీఆర్సీ, ఐఆర్ లపై నిర్ణయాలకు ఆమోద ముద్ర పడనుంది. వెలగపూడిలోని సచివాలయం 1వ బ్లాక్ లో చంద్రబాబు అధ్యక్షతన ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పది రోజుల విదేశీ పర్యటనను ముగించుకుని నేడు రాష్ట్రానికి వస్తున్నారు. సాయంత్రం అమరావతికి రానున్న నారా లోకేష్‌కు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. లోకేష్ విదేశీ పర్యటనతో ఏపీ కేబినెట్ భేటీ, ఉద్యోగులకు డీఏల నిర్ణయం ప్రకటనలో జాప్యం ఏర్పడిందని సైతం ప్రచారం జరుగుతోంది. మరోవైపు నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా నిర్ణయం ప్రకటించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని ప్రభుత్వ వర్గాల సమాచారం. 

ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ పూర్తి

ఏపీ సీఎం చంద్రబాబు పింఛన్‌దారులకు లబ్ది చేకూర్చాలని నెలకు ఒకరోజు ముందుగానే రాష్ట్రంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లాలోని నరసరావుపేట మండలం యల్లమందలో పర్యటించారు. గ్రామంలో పింఛన్ లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు వారికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ నగదు అందజేశారు. మొదట మహిళ ఇంటికి వెళ్లిన సీఎం చంద్రబాబు వారి ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పిల్లలు చాలా తెలివైనవాళ్లు అని బాగా చదివించాలని సూచించారు. అనంతరం టీ షాపు నడుపుతున్న లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి చంద్రబాబు స్వయంగా టీ తయారుచేసి వారికి ఇచ్చారు. లబ్దిదారుడి కోరిక మేరకు టీ షాపు ఏర్పాటు కోసం రూ.5 లక్షలు రుణం ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 

Also Read: AP Govt Good News ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం డబుల్ బొనాంజా! - గురువారం ప్రకటించే అవకాశం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget