అన్వేషించండి
ABP Southern Rising Summit 2024 Yamini Reddy : గజేంద్రమోక్షం కథ మీకు తెలుసుకదా.. ఆ కథని దృశ్య రూపంలో చూశారా ఎప్పుడైనా!
ABP Southern Rising Summit 2024: కూచిపూడి కళాకారిణిగా యామిని రెడ్డి కళారంగంలో మంచి ఆదరణ పొందారు. హైదరాబాద్ లో 'నాట్య తరంగిణి - రాజా రాధా రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కూచిపూడి డాన్స్' నిర్వహిస్తున్నారు.

ABP Southern Rising Summit 2024
1/9

నాట్యానికీ ఓ భాష ఉంటుంది..దాన్ని అర్థం చేసుకోవాలంటారు కూచిపూడి నాట్యకారిణి యామిని రెడ్డి. డాన్సర్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి.. అందుకే మా అమ్మ భయపడింది.. అందుకే డాన్స్ వద్దు అనేసింది..కానీ ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుంది.
2/9

నాట్యం తప్ప ఇంకేం చేయకూడదని నిర్ణయించుకున్నాను..అప్పుడే నా జీవితం మలుపుతిరిగిందని ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లో చెప్పారు యామిని రెడ్డి.
3/9

కూచిపూడి నృత్యం, ముద్రలు గురించి వివరించిన యామిని రెడ్డి.. గజేంద్రమోక్షం కథని చెబుతూ..ముద్రలో రూపంలో నృత్య ప్రదర్శన చేశారు..
4/9

నీటికోసం మడుగులోకి అడుగుపెట్టిన ఏనుగు.. ఏనుగు కాళ్లు పట్టుకున్న మొసలి.. విడిపించుకునేందుకు చేసిన పోరాటం...
5/9

బయటకు వచ్చేందుకు ఏనుగు పోరాటం..లోపలకు లాగేందుకు మొసలి ప్రయత్నం. ఇక తన ఒంట్లో శక్తి మొత్తం తగ్గిపోవడంతో శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తుంది ఏనుగు
6/9

శ్రీమహాలక్ష్మితో వైకుంఠంలో సేదతీరుతున్న విష్ణువు.. తన భక్తుడైన గజేంద్రుడి ఆక్రందన, ప్రార్థన విని శంఖు, చక్రాలను కూడా తీసుకోకుండా వెంటనే బయలుదేరుతాడు..
7/9

శంఖం, చక్రంతో స్వామివారిని అనుసరిస్తూ వస్తాయి.. ఆతర్వాత సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి ఏనుగును కాపాడతాడు శ్రీ మహావిష్ణుడు..
8/9

ఈ మొత్తం కథని ముద్రల రూపంలో వివరిస్తూ నాట్యానికి ఉండే భాషను అర్థమయ్యేలా వివరించారు యామిని రెడ్డి
9/9

యామిని రెడ్డి.. కూచిపూడి విద్వాంసులు పద్మభూషణ్‌లు డా. రాజా రాధా రెడ్డి , కౌశల్య రెడ్డి పెద్ద కుమార్తె & శిష్యురాలు. భారతదేశం సహా విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను మెప్పించి మూడు సార్లు జాతీయ అవార్డు అందుకున్నారు.
Published at : 25 Oct 2024 05:48 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion