SS Rajamouli Mahesh babu Film Launch | మహేశ్ సినిమాకు పూజ..పనులు మొదలుపెట్టిన జక్కన్న | ABP Desam
సూపర్ స్టార్ మహేశ్ బాబు..దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషనల్ లో వస్తున్న సినిమా ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్తోంది. టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ ప్రకారం రేపు అల్యూమినియం ఫ్యాక్టరీలో SSMB29 సినిమా పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడూ తన సినిమా పూజా కార్యక్రమానికి వచ్చే అలవాటు మహేశ్ కి లేదు. సో దాన్ని కంటిన్యూ చేస్తూ మహేశ్ రాకుండా ఉంటారా చూడాలి. ఇప్పటికే సినిమా షూటింగ్ కు సంబంధించిన సెట్ వర్క్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలో కంప్లీట్ చేశారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచరెస్ మూవీగా రాజమౌళి చెబుతున్న ఈ సినిమా ఆఫ్రికా అడవులు, ఎడారుల నేపథ్యంలో సాగనుంది. వైజాగ్ పరిసర ప్రాంతాలు., బొర్రా గుహల్లాంటి కేవ్స్ దగ్గర కూడా ఈ సినిమా షూట్ చేయాలని చూస్తున్నారట. తర్వాత ఆఫ్రికా షెడ్యూల్ మొదలు కానుంది. కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా దుర్గా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసమే మహేశ్ బాబు చాలా నెలలుగా పొడువాటి జుట్టు పెంచి కనిపిస్తున్నారు. రాజమౌళి కూడా ఆఫ్రికాలో పర్యటించి లొకేషన్లు చూసి వచ్చారు. RRR కు ఆస్కార్ దక్కి హాలీవుడ్ లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 1000కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2028లో విడుదల కానుందనే టాక్ నడుస్తోంది.