అన్వేషించండి
In Pics: ఉషా చిలుకూరి - వాన్స్ ఫస్ట్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? ఉషా వాన్స్ రేర్ ఫ్యామిలీ ఫోటోలు
Usha Chilukuri JD Vance: ఉషా చిలుకూరి - జేడీ వాన్స్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరిలో ఒకరి పేరు వివేక్. ఉషా ఒక క్రిస్టియన్‌ను వివాహం చేసుకున్నప్పటికీ ఇంకా హిందూ ఆచారాలనే పాటిస్తున్నారు.

ఉషా చిలుకూరి జేడీ వాన్స్ ఫ్యామిలీ
1/11

ఉషా చిలుకూరి వాన్స్. ఈమె ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న మహిళ. అమెరికాలోని ఓహియో సెనెటర్ గా ఉన్న జేడీ వాన్స్ అనే వ్యక్తి భార్య.
2/11

జేడీ వాన్స్ ప్రస్తుతం అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ను రిపబ్లికన్ పార్టీ ఎంపిక చేసింది. ట్రంప్ మాత్రం ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు.
3/11

దీంతో ఒక తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతున్నాడని వివిధ వార్తా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇండియన్ అమెరికన్ భర్త అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారని అంతర్జాతీయ వార్తా సంస్థలు రాస్తున్నాయి.
4/11

ఉషా చిలుకూరి వయసు 39. ఆమె శాన్‌ఫ్రాన్సిస్‌కోలో ఒక ప్రముఖ లీగల్ అసోసియేట్ గా ఉన్నారు.
5/11

ఉషా చిలుకూరి తల్లిదండ్రులు డాక్టర్ క్రిష్ చిలుకూరి - లక్ష్మీ చిలుకూరి. వీరి మూలాలు ఆంధ్రప్రదేశ్ కాగా.. ఉషా పుట్టక ముందే వారు అమెరికాలో స్థిరపడినట్లుగా చెబుతున్నారు.
6/11

అయినప్పటికీ ఉషా భారతీయ సంప్రదాయాలను ఎప్పటికి మర్చిపోలేదని అంటున్నారు. తన పిల్లల్లో ఒకరికి వివేక్ అని పేరు పెట్టుకున్నారు.
7/11

ఉషా చిలుకూరి యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీ బ్యాచిలర్ డిగ్రీ.. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ చేశారు.
8/11

న్యాయ సంబంధమైన విభాగాల్లో ఉషా బాగా పని చేశారు. అమెరికా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్‌లు జస్టిస్ జాన్ రాబర్ట్స్, జస్టిస్ బ్రెట్ కెవానా వద్ద పని చేశారు.
9/11

ఉషా యేల్ యూనివర్సిటీలో లా స్కూలులో ఉండగానే జేడీ వాన్స్‌ను కలిశారు. అలా వారు 2014లో పెళ్లి చేసుకున్నారు.
10/11

వీరికి ముగ్గురు పిల్లలు ఇవాన్ (2017), వివేక్ (2020), మిరబెల్ (2021).
11/11

ఉషా - వాన్స్ మతాలు వేరు అయినప్పటికీ ఉషా మాత్రం ఇంకా హిందూ ఆచారాలనే పాటిస్తున్నారు. జేడీ వాన్స్ మాత్రం రోమన్ క్యాథలిక్ గానే ఉన్నారు. నవంబరులో జరగబోయే ఎన్నికల్లో వాన్స్ ఉపాధ్యక్షుడిగా గెలిస్తే.. ఉషా చిలుకూరి యూఎస్ ద్వితీయ పౌరురాలు కానున్నారు.
Published at : 16 Jul 2024 10:31 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
న్యూస్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion