అన్వేషించండి
Kriti Kharbanda Haldi Ceremony Pics: పసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్', రామ్ పోతినేని 'ఒంగోలు గిత్త' తదితర సినిమాల్లో నటించిన కృతి కర్బందా ఇటీవల పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన తర్వాత హల్దీ వేడుక ఫోటోలు షేర్ చేశారు.

పెళ్లికి ముందు హల్దీ వేడుక జరుపుకోవడం కామన్. కానీ... మార్చి 15న వివాహ బంధంలో అడుగు పెట్టిన పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా మాత్రం హల్దీ బదులు వెరైటీగా ముల్తానీ మట్టితో ప్లాన్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
1/7

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' సినిమా గుర్తు ఉందా? అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే హీరోయిన్ గుర్తు ఉందా? ఆ అమ్మాయే ఈ ఫోటోలు ఉన్న అమ్మాయి. పేరు కృతి కర్బందా! రామ్ పోతినేని సరసన 'ఒంగోలు గిత్త' సినిమాలోనూ నటించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అక్కగా 'బ్రూస్ లీ'లో కనిపించారు. మార్చి 15న ఆమె పెళ్లి చేసుకున్నారు. అయితే... హల్దీ వేడుక ఫోటోలను ఇప్పుడు షేర్ చేశారు. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
2/7

బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తొలుత ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే... కొన్ని రోజుల తర్వాత చెప్పేశారు. లివిన్ రిలేషన్షిప్ కు ఫుల్ స్టాప్ పెడుతూ... మార్చి 15న వీళ్లిద్దరూ ఏడడుగులు వేశారు. పెళ్లి ఫోటోలు కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. అయితే... హల్దీ సెర్మనీ ఫోటోలు ఇప్పుడు విడుదల చేశారు. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
3/7

సాధారణంగా హల్దీ సెర్మనీ అంటే పసుపు రాసుకుంటారు కదా! కానీ, కృతి కర్బందా వెరైటీగా ప్లాన్ చేశారు. పసుపు బదులు ముల్తానీ మట్టి రాశారు. పులకిత్ కోసం అలా ప్లాన్ చేశామని చెప్పారు. పెళ్లిలో అబ్బాయి మెరిసిపోవాలని అలా చేశామని అన్నారు. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
4/7

'తీన్ మార్' కంటే ముందు సుమంత్ 'బోణీ' సినిమాలో కృతి కర్బందా నటించారు. తెలుగులో, ఆ మాటకు వస్తే కథానాయికగా ఆమెకు తొలి సినిమా అది. 'ఒంగోలు గిత్త' సినిమాకు ముందు 'మిస్టర్ నూకయ్య', తర్వాత 'ఓం త్రీడీ' వంటి సినిమాలు చేశారు. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
5/7

'బ్రూస్ లీ' తర్వాత కృతి కర్బందా తెలుగులో మరో సినిమా చేయలేదు. ప్రజెంట్ ఆమె హిందీ సినిమాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. (Image Courtesy: kriti.kharbanda / Instagram)
6/7

హల్దీ వేడుక... సారీ ముల్తానీ మట్టి వేడుకల్లో పులకిత్ సామ్రాట్ (Image Courtesy: kriti.kharbanda / Instagram)
7/7

పులకిత్ సామ్రాట్, కృతి కర్బందా పెళ్లి వేడుక ఫోటోలు (Image Courtesy: kriti.kharbanda / Instagram)
Published at : 24 Mar 2024 05:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
న్యూస్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion