అన్వేషించండి
Naa Saami Ranga: 'నా సామిరంగ' బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ - సందడి చేసిన 'కింగ్', స్పెషల్ అట్రాక్షన్‌గా ఆషికా
Nagarjuna Akkineni: అన్ కండిషనల్ లవ్ తో ‘నా సామిరంగ’కు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు. నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో కింగ్ నాగార్జున

Image Credit: Naa Saami Ranga Movie/Twitter
1/13

Naa Saami Ranga success Celebrations: కింగ్ నాగార్జున అక్కినేని - ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంతో తెరకెక్కిన చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని నిర్మించగా పవన్ కుమార్ సమర్పించారు.
2/13

నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా ఘన విజయాన్ని సాధించింది.
3/13

ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు ప్రసంశలు అందుకొని సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా అలరిస్తోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని నిర్వహించింది. ఈ వేడుకలో కింగ్ నాగార్జున చేతులు మీదగా మూవీ యూనిట్‌కి సక్సెస్ షీల్డ్స్‌ని అందించారు మేకర్స్.
4/13

ఈ కార్యక్రమానికి ఆస్కార్ విజేత ఎంఎం కిరవాణి, నాగార్జున, హీరోయిన్ ఆషికా రంగనాథ్, అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ బిన్ని, గేయ రచయిత సుభాస్ చంద్రబోస్, తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరోయిన్ ఆషికా రంగనాథ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
5/13

ట్రాన్స్‌పరేంట్ క్రిం శారీలో ఆషిక మెరిసిపోయింది. ఆమె లుక్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. మరోవైపు కింగ్ నాగార్జున కూడా ఈ సక్సెస్ వేడుకలో తెగా సందడి చేశారు. అన్ కండిషనల్ లవ్‌తో నా సామిరంగకు ఘనవిజయం అందించిన ప్రేక్షకులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
6/13

ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. అన్ కండీషనల్ లవ్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మీరు ఎప్పుడూ ప్రేమని పంచుతూనే వుంటారు. నేను కనిపించగానే ఆనందంతో నవ్వుతూవుంటారు.
7/13

వారి చిరునవ్వే నాకు ధైర్యం. ఎంతో పాజిటివ్ గా ఉంటూ మాకు థియేటర్స్, రిలీజ్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థాంక్స్. ఈ సినిమా ప్రయాణం చాలా అద్భుతంగా జరిగింది. అందరూ ఎంతో ప్రేమతో పని చేశారు.
8/13

అషికా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునమా థాంక్స్ చెప్పడం కాదు.. ప్రతిఒక్కరినీ చాలా మిస్ అవుతున్నాను అని అన్నారు. అలాగే ఆషికా మాట్లాడుతూ.. నా సామిరంగ జర్నీని చాలా ఎంజాయ్ చేశానంది. కీరవాణి గారితో వర్క్ చేయడం చాలా అనందంగా ఉందని, అందరూ నన్ను వరాలు పేరుతో పిలవడం చాలా అనందంగా వుంది.
9/13

నాగార్జున గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. నాగార్జున గారితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఆయనతో మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చింది.
10/13

ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. నిర్మాత శ్రీనివాస్ గారు సంక్రాంతి విడుదల చేయాలనీ నిర్ణయించుకున్నారు. అనుకున్న పని సాధించారు. వారికి అభినందనలు. ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ ఈ చిత్రాన్ని చేసి విజయం సాధించిన దర్శకుడు విజయ్ కి అభినందనలు.
11/13

కొత్త ప్రతిభని నమ్ముతూ టీం వర్క్ ని నమ్మి ఇంత ఫ్రీడం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఇంత సెంటిమెంట్ నరేష్ గారి వలనే సాధ్యమైయింది. సినిమాలో చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. చంద్రబోస్ గారితో ప్రయాణం ఇలానే కొనసాగాలని అన్నారు.
12/13

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. డీవోపీ శివ సంక్రాంతి అల్లుడు. ఈ సంక్రాంతి హనుమాన్, నా సామిరంగ విజయాలు అందుకున్నాడు. చోటా ప్రసాద్ గారితో వర్క్ చేయడం మంచి అనుభూతి. కీరవాణి గారు, చంద్రబోస్ గారిది విడదీయరాని బంధం.
13/13

ఎప్పుడూ ఇలానే ఉంటూ మరింత మంచి సంగీతం అందించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. టీం అందరికీ థాంక్స్. విజయ్ బిన్నీ గారు సక్సెస్ అందుకోవడం చాలా అనందంగా ఉందన్నారు.
Published at : 29 Jan 2024 02:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion