అన్వేషించండి
Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ పంద్రాగస్టు వేడుకలు- కుమార్తె ఆద్యతతో సెల్ఫీ దిగిన ఫొటో వైరల్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జరిగిన 78వ సాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. కుమార్తె ఆద్యతో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కుమార్తె ఆద్యతతో సెల్ఫీ దిగిన పవన్
1/12

కాకినాడలో జరిగిన 78వ స్వాతంత్ర్యదినోత్సవంలో పాల్గొన్నారు డిప్యూటీసీ సీఎం పవన్ కల్యాణ్. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు , యువకుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
2/12

కాకినాడ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వంధనం స్వీకరించారు.
3/12

కాకినాడలో పంద్రాగస్టు వేడుకల్లో మాట్లాడిన పవన్ కల్యాణ్... నియంతృత్య పోకడలు, జాతీ సంపదను దోచుకుని ప్రజలను నిర్లక్ష్యం చేసే పాలకులను ఎప్పుడూ ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.
4/12

సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడానికి షణ్ముఖ వ్యూహంతో ఎన్డీఏ ప్రభుత్వం పని చేస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటికే 28 రకాల సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు.
5/12

ప్రజల శ్రేయస్సు కోసం డొక్కా సీతమ్మ పేరుతో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని, అన్న క్యాంటీలను అమలు చేస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అదే టైంలో రాష్ట్రాభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు.
6/12

పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు పవన్ కల్యాణ్. సర్పంచులకు అధికారాలు, సాతంత్య్ర, గణ దినోత్సవాల నిర్వహణకి కూడా నిధుల పెంచుతామని తెలిపారు. మైనర్ పంచాయతీలకు పది వేలు, మేజర్ పంచాయతీకు రూ. 25 వేలు అందిస్తామన్నారు.
7/12

ప్రజా సంపద కొల్లగొట్టిన వారెవర్నీ విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఐదేళ్లుగా శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆర్థిక వ్యవస్థ అస్తవ్స్థమైందన్నారు. అడవుల్లో కొట్టేసిన ఎర్రచందనం కర్ణాటకలో అమ్ముకున్నారన్నారన్నారు.
8/12

అసలు గత పాలకు చేసిన అక్రమాల వల్ల పాలనలో ఎలా ముందుకెళ్లాలో అనే పరిస్థితి ఏర్పడిందని అయినా శక్తిని కూడదీసుకొని వెళ్తున్నట్టు తెలిపారు.
9/12

ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశామని ఇంకా అమలు చేస్తామని తెలిపారు పవన్ కల్యాణ్
10/12

తాను డిప్యూటీసీఎంను కాబట్టి తన పరిధిలో కొన్ని చెప్పలేనని కచ్చితంగా ప్రజలు సంతోషపడే పాలనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.
11/12

పవన్ కల్యాణ్ రావడంతో కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు.
12/12

కాకినాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో కుమార్తెతో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్యతతో దిగిన సెల్ఫీ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
Published at : 15 Aug 2024 02:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion