అన్వేషించండి
Rahul Gandhi in AP: కర్నూలు జిల్లాలో మొదలైన రాహుల్ పాదయాత్ర, రాష్ట్రంలో మొత్తం 119 కి.మీ యాత్ర
ఏఐసీసీ అగ్రనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో ఈ యాత్ర కొనసాగుతుంది.

ఏపీలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర
1/9

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
2/9

నేటి ఉదయం 6.30 గంటలకు కర్నూల్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం అయింది.
3/9

ఈ యాత్రకు సంబంధించి నాలుగు నియోజకవర్గాలు ఆలూరు, ఆదోని ఎమ్మిగనూరు, మంత్రాలయంలో నాలుగు రోజులపాటు 119 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది.
4/9

ఆరున్నర గంటలకు పాదయాత్ర ప్రారంభం క్షేత్ర గుడి నుండి ఉదయం 10:30 గంటలకు విరామం తీసుకుంటారు.
5/9

ఆలూరు నగర శివారులో సాయంత్రం పాదయాత్ర ప్రారంభం, రాత్రి ఏడున్నర గంటలకు నేటి పాదయాత్ర విరామం తీసుకుంటారు.
6/9

19వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు తిరిగి చాగి నుంచి రాహుల్ యాత్ర ప్రారంభం కానుంది.
7/9

ఎల్లుండి ఉదయం 10.30 నిమిషాలకు ఆదోని ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీకి యాత్ర చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు ఆదోనిలోని ఆరేకల్ లోని జెల్లి నాగన్నా తాతా దర్గా నుంచి యాత్ర సాగనుంది. ఎమ్మిగనూరు చెన్నాపురం క్రాస్ వద్ద రాహుల్ రాత్రి బస చేయనున్నారు.
8/9

20వ తేదీ ఉదయం 6.30 నిమిషాలకు పాదయాత్ర ఎమ్మిగనూరు నుంచి ప్రారంభం కానుంది. గురువారం 11 గంటలకు యెమ్మిగనూరు ధర్మాపురం గ్రామానికి రాహుల్ యాత్ర చేరుకుంటుంది.
9/9

సాయంత్రం నాలుగు గంటలకు ధర్మాపురం టోల్ గేట్ వద్దకు, రాత్రి ఏడు గంటలకు కల్లుదేవర కుంటకు పాదయాత్ర చేరుకుంటుంది. మంత్రాలయం అవుట్ కర్ట్స్ లో రాత్రి రాహుల్ బస చేయనున్నారు. (All Images Credit: Twitter/Congress)
Published at : 18 Oct 2022 11:04 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion