World Post Day 2021: ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్.. అప్పట్లో ఆల్ ఇన్ వన్ అయిన పోస్ట్ కార్డ్స్ గురించి ఈ విషయాలు తెలుసా!
కొన్ని దశాబ్దాల కిందటివరకు తపాలానే అందరికీ కమ్యూనికేషన్ సాధనం. మనుషులు దూరంగా ఉన్నా తమ బంధాన్ని పోస్ట్ ద్వారా బలపరుచుకునేవారు. మనీ ఆర్డర్ లాంటి ఆర్థిక సేవల్ని సైతం అందించింది.
టెక్నాలజీలో వచ్చిన మార్పులతో ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలతో సెకన్ల వ్యవధిలో ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితోనైనా కమ్యూనికేట్ అవుతున్నాం. కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు. కొన్ని దశాబ్దాల కిందటివరకు తపాలానే అందరికీ కమ్యూనికేషన్ సాధనం. అతి తక్కువ ధరకే తమ బంధువులు, మిత్రులకు వివరాలు తెలుపుతూ లెటర్స్ రాసేవాళ్లు. మనుషులు దూరంగా ఉన్నా తమ బంధాన్ని పోస్ట్ ద్వారా బలపరుచుకునేవారు. ఇప్పుడిదంతా ఎందుకంటారా.. అక్టోబర్ 9వ తేదీని ప్రపంచ తపాలా దినోత్సవం (World Post Day 2021)గా సెలబ్రేట్ చేసుకుంటాం.
1874లో అక్టోబర్9న తొలిసారిగా యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీఎన్) ఏర్పడింది. కనుక ఆ రోజునే వరల్డ్ పోస్ట్ డేగా జరుపుకుంటున్నాం. జపాన్ రాజధాని టోక్యోలో 1969లో యూపీఎన్ తొలి సమావేశం జరిగింది. ప్రపంచంలోని నలుమూలలకు పోస్ట్ కార్డులు రాయాలనేది ఆ సమావేశం యొక్క సారాంశం. మరోవైపు అక్టోబర్ 9 నుంచి 15 వరకు వారం రోజులపాటు నేషనల్ పోస్ట్ వీక్ నిర్వహిస్తారు. వరల్డ్ పోస్ట్ డే, నేషనల్ పోస్ట్ వీక్ సందర్భంగా తపాలా శాఖ గురించి కొన్ని ఆసక్తి విషయాలు ఇక్కడ తెలుసుకుందామా.
Also Read: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. పూర్తి వివరాలు
వరల్డ్ పోస్ట్ డే హిస్టరీ..
టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని 1600 సంవత్సరాల కాలంలో పలు దేశాలు పోస్ట్ కార్డ్స్ రాయడం మొదలుపెట్టాయి. రెండు వందల ఏళ్లకు అంటే 1800 నాటికి వీటి సేవలు మరికొన్ని దేశాలకు వ్యాపించాయి. వీటికి అధికారికంగా యూనియన్ ఉంటే బాగుంటుందని, వీటి సేవల్ని సైతం అధికారికంగా ప్రచారం చేసేందుకు 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఏర్పాటైంది. యూపీయూ 1948లో యూఎన్‌లోని ఓ ఏజెన్సీగా మారింది. 1969 అక్టోబర్ 9న తొలి వరల్డ్ పోస్టల్ డే నిర్వహించారు. భారత్ ప్రతినిధిగా ఆనంద్ నరులా ఈ ప్రతిపాదనను ఆమోదించడంతో అప్పటినుంచి ఈ తేదీన భారత్‌లో సైతం ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ దేశాలలో సమాచార మార్పిడికి బెస్ట్ కమ్యూనికేషన్ వ్యవస్థగా నిలిచిన పోస్టల్ శాఖల సేవలు ఈ తరం వాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ కొందరు గొప్ప వ్యక్తుల లేఖల ద్వారా లక్షలాది మంది ప్రభావితం అయ్యేవారు. గొప్ప వ్యక్తుల సేవల్ని స్మరించుకుంటూ వారి పేరట పోస్టల్ స్టాంపులను పోస్టల్ డిపార్ట్ మెంట్ విడుదల చేసేది.
Also Read: వామ్మో ఇంత పొడవైన పాము కుబుసాన్ని ఎప్పుడైనా చూశారా?.. సర్పాల చర్మ రహస్యం ఇదే!
వరల్డ్ పోస్ట్ డే థీమ్..
ఈ ఏడాది వరల్డ్ పోస్ట్ డే థీమ్ ‘ఇన్నోవేటివ్ టు రికవర్’. డిజిటల్ కు మారుతున్న సందర్భంగా పోస్టల్ శాఖను రక్షించుకోవాలని, పూర్వ వైభవం తిరిగివచ్చేలా చేయాలన్నది ముఖ్య ఉద్దేశం.
మన దేశంలో వరల్డ్ పోస్ట్ వీక్ నిర్వహిస్తారు. వారం రోజుల తపాలా వారోత్సవాలను అక్టోబర్ 9 నుంచి 15 వరకు కొనసాగుతుంది. తపాలా ఉత్పత్తులు మరియు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కొన్ని దేశాలలో వరల్డ్ పోస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. భిన్న రకాల తపాలా స్టాంప్‌లను సైతం ప్రదర్శిస్తారు. మరికొన్ని దేశాల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోస్టల్ ఉద్యోగులను గౌరవించుకుని సత్కరించే కార్యక్రమాలు చేపడతారు.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..