Scholarships: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..
ప్రతిభ ఉండి ఉన్నత విద్యను అభ్యసించలేని విద్యార్థులకు చేయూతను అందించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. స్కాలర్‌షిప్ (Scholarship) పేరుతో ఆర్థిక సాయం అందిస్తున్నాయి.
కోవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా జీవన శైలి, విద్యా విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కోవిడ్ సంక్షోభం వల్ల పలువురు ఉపాధికి దూరమయ్యారు. కొంతమంది విద్యార్థులు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. స్కాలర్‌షిప్ (Scholarship) ప్రోగ్రామ్‌ల పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఇప్పటికే HDFC బ్యాంకు, ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) ఫౌండేషన్, కోటక్ మహీంద్ర గ్రూప్ వంటి సంస్థలు విద్యార్థుల ఉన్నత విద్యకు స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ల రూపంలో ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఇలాంటి మరికొన్ని స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ల వివరాలు మీకోసం..
Also Read: విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ స్కాలర్‌షిప్‌లు..
బీవైపీఎస్ సశక్త్ స్కాలర్‌షిప్.. (BYPL SASHAKT Scholarship)
బీఎస్ఈఎస్ యమునా పవర్‌లిమిటెడ్ (BYPL) ఢిల్లీలోని ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు ఉన్నత చదువుకు సాయం అందిస్తుంది. ఢిల్లీలో అండర్ గ్రాడ్యుయేట్ (UG) ప్రోగ్రామ్‌లో (ఏదేనా విభాగం) ఫైనలియర్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందిస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా వెనుకబడిన వర్గాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు లబ్ధి చేకూకుతుందని సంస్థ వెల్లడించింది. ఢిల్లీలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అండర్ గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న వారు.. అంతకు ముందు విద్యా సంవత్సరంలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించి ఉండరాదు. అర్హులైన విద్యార్థులకు రూ.30000 రివార్డు (ప్రైజ్) అందిస్తారు.
దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 నవంబర్ 14
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ వివరాలు: www.b4s.in/it/BYPL1
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి...
ఎన్ఎస్‌పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ (NSP Central Sector Scheme of Scholarship)
ఏదేనా కాలేజీ /యూనివర్సిటీలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసుకుని ఉన్నత విద్యా చదవలేని మెరిట్ విద్యార్థులకు ఎన్ఎస్‌పీ సెంట్రల్ సెక్టర్ స్కాలర్‌షిప్ లభిస్తుంది. 12వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించి ఆర్థిక స్థితి సరిగాలేని కారణంగా చదవలేని స్థితిలో ఉన్నవారు ఈ ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు. 12వ తరగతిలో 80 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఏఐసీటీఈ (AICTE), డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థ/కాలేజీలో మెడికల్ లేదా ఇంజనీరింగ్ వంటి కోర్సును రెగ్యులర్ విధానంలో చదువుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర స్కాలర్‌షిప్‌లు పొందే వారు దీనికి అనర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటంబ ఆదాయం రూ.8 లక్షలకు మించి ఉండరాదు. ఎంపికైన విద్యార్థులకు రివార్డు కింద ఏడాదికి రూ.10,000ల నుంచి రూ.20,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు.
దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 నవంబర్ 30
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ వివరాలు: https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction
టాటా క్యాపిటల్ పంఖ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ (Tata Capital Pankh Scholarship Programme)
కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు దీని ద్వారా స్కాలర్‌షిప్ పొందవచ్చు. 6 నుంచి 12వ తరగతి చదివే వారితో పాటు, పాలిటెక్నిక్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్ష ఫీజు, ట్యూషన్ ఫీజులో 80 శాతం వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అకడమిక్‌లో 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు కుటుంబ వార్షిక ఆదాయం రూ.4 లక్షలకు మించి ఉండరాదు. అలాగే నోటిఫికేషన్లో పేర్కొన్న సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలి.
దరఖాస్తు స్వీకరణ ఆఖరు తేదీ: 2021 అక్టోబర్ 15
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
అధికారిక నోటిఫికేషన్ వివరాలు: https://www.tatacapital.com/sustainability/affirmative-action.html
Also Read: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. బీటెక్‌లో బ్రేక్ స్టడీ.. జేఎన్‌టీయూ కీలక నిర్ణయం..
Also Read: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..