News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

UGC Scholarships: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..

కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

FOLLOW US: 
Share:

కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్కాలర్‌షిప్‌‌ రూపంలో ఆర్థిక తోడ్పాటు అందించనుంది. దీనికి సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఒంటరి బాలికల కోసం (Single Girl Child) పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్‌‌.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం పీజీ స్కాలర్‌షిప్‌ (SC, ST Scholarship Scheme).. ఈశాన్య ప్రాంత విద్యార్థుల కోసం ఇషాన్ ఉదయ్ స్పెషల్ స్కాలర్‌షిప్‌ (Ishan Uday).. యూనివర్సీటీల ర్యాంక్ హోల్డర్ల కోసం పీజీ స్కాలర్‌షిప్‌ (University Rank Holders) వంటి నాలుగు పథకాలతో స్కాలర్‌షిప్‌ అందిస్తుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు జాతీయ స్కాలర్‌షిప్‌ (NSP) పోర్టల్ అయిన scholarships.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూజీసీ సూచించింది. ఈ నాలుగు స్కాలర్‌షిప్‌‌ స్కీంల వివరాలు మీకోసం.. 

1. ఒంటరి బాలికలకు పీజీ ఇందిరా గాంధీ స్కాలర్‌షిప్‌.. (Post graduate Indira Gandhi Scholarship For Single Girl Child)
పోస్టు గ్రాడ్యుయేషన్ చదివే ఒంటరి అమ్మాయిల కోసం ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబంలో ఒకే కుమార్తె ఉన్న విద్యార్థినులు, కవల అమ్మాయిలు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా మొత్తం 3000 మందికి సాయం అందిస్తారు. దీని కింద ఎంపికైన వారికి ఏడాదికి రూ.36,200 చొప్పున రెండేళ్ల పాటు స్కాలర్‌షిప్‌ వస్తుంది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Also Read: Scholarship Programs: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎస్సీ, ఎస్టీ స్కాలర్‌షిప్‌ స్కీమ్ (Postgraduate SC, ST Scholarship Scheme)
ప్రొఫెషనల్ కోర్సులను చదువుతోన్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు యూజీసీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద వెయ్యి మందికి స్కాలర్‌షిప్‌‌లు అందిస్తుంది. ఎంఈ, ఎంటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న వారికి నెలకు రూ.7,800 స్కాలర్‌షిప్‌‌ అందిస్తారు. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, ఎంఎస్‌డబ్ల్యూ వంటి నాన్ ప్రొఫెషనల్ కోర్సులు చదువుకుంటున్న వారు ఈ పథకానికి అనర్హులు. దీనికి కూడా నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

3. యూజీసీ ఇషాన్ ఉదయ్ స్కాలర్‌షిప్‌ (UGC Ishan Uday Scholarship)
ఈశాన్య ప్రాంతాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. మొత్తం 10,000 మందికి ఈ స్కీం కింద ఆర్థిక చేయూత అందిస్తున్నారు. 2014-15 విద్యా సంవత్సరం నుంచి దీని ద్వారా స్కాలర్‌షిప్‌‌ ఇస్తున్నారు. జనరల్ డిగ్రీ కోర్సులు చదివే వారికి నెలకు రూ.5,400.. టెక్నికల్, పారామెడికల్, ప్రొఫెషనల్ కోర్సులు చేసే వారికి రూ.7,800 ఆర్థిక సాయం అందిస్తారు. ఈశాన్య ప్రాంతాల విద్యార్థులకు ఉన్నతావకాశాలు కల్పించడం, స్థూల నమోదు నిష్పత్తి (GER) పెంచడమే లక్ష్యంగా యూజీసీ దీనిని రూపొందించింది. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 

Also Read: Career Guidance: జ్యుయెలరీ డిజైనింగ్ అంటే మీకు ఇష్టమా? ఇందులో కూడా డిప్లొమా, డిగ్రీ చేయొచ్చు.. ఆభరణాల డిజైనర్లకు ఫుల్ డిమాండ్..

4. యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్స్ స్కాలర్‌షిప్‌ (UGC Scholarship For University Rank Holders)
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన (outstanding performance) ఇచ్చిన వారితో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సులు చదువుతున్న వారి కోసం యూజీసీ ఈ స్కాలర్‌షిప్‌ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేటు యూనివర్సిటీలు, అటానమస్ కాలేజీలు లేదా పీజీ కాలేజ్ రెగ్యులర్ వంటి వాటిలో ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన ఫస్ట్, సెకండ్ ర్యాంకు సాధించిన వారు ఈ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రెండేళ్ల పాటు నెలకు రూ.3,100 చొప్పున చెల్లిస్తారు. అయితే దూర విద్య, వృత్తి విద్య ద్వారా విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ స్కీం పరిధిలోకి రారు. ఆసక్తి ఉన్న వారు నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

Also Read: Career Guidance: చరిత్ర అంటే ఇష్టమా? ఇది కూడా బెస్ట్ కెరీర్ ఆప్షనే.. మీకేం కావాలో ఎంచుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 28 Sep 2021 01:01 PM (IST) Tags: Education Students career UGC Scholarship Programs In India UGC Scholarships Scholarships University Grants Commission UG PG

ఇవి కూడా చూడండి

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

CTET 2023 Results: సీటెట్‌ (జులై) - 2023 ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ కోసం డైరెక్ట్ లింక్

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

AP ECET: ఏపీఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

ANGRAU Admissions: ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్‌ ఆప్షన్లు

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

Scholarships: సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24, చివరితేది ఎప్పుడంటే?

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

NITW: వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే

టాప్ స్టోరీస్

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

YS Sharmila: ఈ 30లోపు నిర్ణయం, లేకపోతే ఒంటరిగానే పోటీ - పార్టీ విలీనంపై షర్మిల ప్రకటన

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

చాలామంది నన్ను ఉంచుకుంటా అన్నారు, కానీ పెళ్లి చేసుకుంటా అనలేదు: జయలలిత

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్

Women Cricket Team Wins Gold: మన అమ్మాయిలు బంగారం - ఏసియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్‌లో లంకను ఓడించిన భారత్