By: ABP Desam | Updated at : 23 Sep 2021 03:23 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ప్రతి విద్యార్థికి ఏదో ఒక సబ్జెక్ట్ పట్ల ప్రత్యేక ఆసక్తి లేదా ఇష్టం ఉంటుంది. సంస్కృతి, చరిత్రపై మీకు మక్కువ ఉంటే మీరు చరిత్రను కెరీర్‌గా ఎంచుకోవచ్చు. చరిత్ర సబ్జెక్ట్ కింద ప్రతి కాలానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి మీకు సమాచారం లభిస్తుంది. చరిత్రకు సంబంధించిన అన్ని కోర్సులు 12వ తరగతి తర్వాత మాత్రమే మొదలవుతాయి. మీరు చరిత్రలో గ్రాడ్యుయేషన్ కూడా చేయవచ్చు. గ్రాడ్యుయేషన్ తర్వాత పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ వంటి కోర్సులను సెలక్ట్ చేసుకోవచ్చు. చరిత్ర కూడా విద్యార్థులకు బెస్ట్ కెరీర్ ఆప్షన్లలో ఒకటిగా నిలుస్తోంది. దీనిని కెరీర్‌గా ఎంచుకున్న వారిని క్రియేటివ్ రంగం ఆహ్వానిస్తోంది. చరిత్రకు సంబంధించిన బెస్ట్ 5 కెరీర్ అవకాశాలు ఏంటో చూద్దాం.
Also Read: Education:2520 ఈ నంబర్ కి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా...
మీడియా (Media) : మీడియా అనేది పాఠకుల ముందుకు విభిన్నమైన, ఉత్తమమైన కంటెంట్‌ను తీసుకురావడానికి చాలా ముఖ్యమైన బాధ్యత గల వృత్తి. వాస్తవాలను వక్రీకరించకుండా కంటెంట్‌ని అందించడానికి చరిత్ర చాలా ముఖ్యమైనదని రుజువు చేయవచ్చు. మీకు చరిత్ర మీద ఆసక్తి ఉంటే మీడియా రంగంలో బెస్ట్ కెరీర్ ఉంటుంది. మీరు రాయాలనుకునే వార్తలకు చరిత్రలో జరిగిన విషయాలను జోడిస్తే.. పాఠకులకు మరింత సమాచారం అందుతుంది.
ప్రొఫెసర్ (Professor): మన సమాజంలో ఉపాధ్యాయుడి ఉద్యోగం గొప్ప గౌరవంగా పరిగణించబడుతుంది. మీరు దేశ, విదేశాల చరిత్ర గురించి విద్యార్థులకు బోధించాలనుకుంటే హిస్టరీ టీచర్ లేదా ప్రొఫెసర్‌గా మీ కెరీర్‌ను ఎంచుకోవచ్చు.
Also Read: Education Apps: పిల్లలకు 'స్మార్ట్'గా చదువు నేర్పే యాప్‌లు..
రచయిత (Writer) : మీకు చదవడం, రాయడం వంటి వాటిపై ఆసక్తి ఉంటే ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. రచయితకు వివిధ రకాలైన అంశాలపై లోతైన జ్ఞానం ఉండాలి. దీనితో పాటుగా మానవ నాగరికతకు ముందు ఆ తర్వాత జరిగిన ఘటనలపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండటం అవసరం. దీని కోసం చరిత్ర సబ్జెక్టు కంటే మెరుగైన సబ్జెక్ట్ మరొకటి ఉండదు.
రాజకీయాలు (Politics): రాజకీయాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చరిత్ర చాలా ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి గతంలో ఏం జరిగిందనే అంశాలపై అవగాహన ఉండటం చాలా అవసరం. రాజకీయ నాయకులు ప్రజల ఎదుట ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. చరిత్రపై పట్టు ఉంటే వారి ప్రసంగాలకు అదనపు హంగు చేకూరుతుంది. గొప్ప గొప్ప రాజకీయ నాయకులంతా తమ ప్రసంగాలలో చరిత్రలో ప్రముఖ వ్యక్తులు చెప్పిన కొటేషన్లు, సామెతలను జోడిస్తుంటారు. రాజకీయాలలో ఉన్నత స్థానాల్లోకి వెళ్లాలంటే చరిత్రపై పట్టు అవసరం.
న్యాయవాది (Advocacy): చరిత్ర నేపథ్యం ఉన్న విద్యార్థులు న్యాయవాద రంగాల్లో రాణించడం చాలా సులభం. గతంలో ఇచ్చిన తీర్పులపై మంచి అవగాహన ఉండటంతోపాటు లాజికల్ గా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్నవారు న్యాయవాదిగా రాణించవచ్చు. కాబట్టి మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే పైన చెప్పిన వాటిలో మీ నైపుణ్యాలకు సరిపోలిన కెరీర్ ఆప్షన్ ఎంచుకోండి.
Also Read: IGNOU July 2021: ఇంటి నుంచే డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? 'ఇగ్నో' గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..
GATE 2023: 'గేట్ - 2023' పరీక్షకు సర్వం సిద్ధం! ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో ఎగ్జామ్! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Inter Attendance: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, అటెండెన్స్ తక్కువున్నా 'ఫైన్'తో పరీక్షలకు అనుమతి!
ICAI CA Results: సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
Jee Main 2023 answer key: జేఈఈ మెయిన్ ప్రాథమిక 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
Kakinada Crime: బాలిక సజీవ దహనం కేసులో సంచలన తీర్పు - నిందితుడికి జీవిత ఖైదు, భారీ జరిమానా
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!