అన్వేషించండి

IGNOU July 2021: ఇంటి నుంచే డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్నారా? 'ఇగ్నో' గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..

IGNOU: దేశంలోనే అతిపెద్ద సార్వత్రిక వర్సిటీగా పేరొందిన ఇగ్నో.. జూలై సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు గడువును పొడిగించింది. యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

దూర విద్య విధానంలో చదవాలనుకునే వారికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్ డిస్టెన్స్ లెర్నింగ్, ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లు, అనేక ఇతర కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జూలై సెషన్‌కు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 23 వరకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సహా మరిన్ని వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ ignou.ac.inను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది. దీని ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు, అవేర్‌నెస్ డిగ్రీ ప్రోగాం సహా పలు కోర్సుల్లో చేరవచ్చు. యూజీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్దేశించిన గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించగా.. తాజాగా మరోసారి పెంచింది. 

ప్రవేశ పరీక్ష లేకుండానే ఇగ్నోలో ఎంబీఏ..
దూరవిద్య ద్వారా ఎంబీఏ కోర్సులో చేరాలనుకునే వారికి ఇగ్నో శుభవార్త అందించింది. ఇకపై ప్రవేశపరీక్ష మార్కులతో సంబంధం లేకుండా నేరుగా ఎంబీఏ కోర్సులో చేరవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఇగ్నో ఎంబీఏ కోర్సులో చేరాలంటే ‘ఓపెన్‌ మ్యాట్‌’ ప్రవేశ పరీక్షను నిర్వహించేవారు. ఇప్పుడు పరీక్ష లేకుండా డిగ్రీ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 30లోగా ignouadmission.samarth.edu.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని ఇగ్నో హైదరాబాద్‌ ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ ఫయాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. 

ఇగ్నోలో కొత్తగా రెండు కోర్సులు..
ఇగ్నోలో ఈసారి కొత్తగా రెండు మేనేజ్​మెంట్​ కోర్సులు ప్రారంభం కానున్నాయి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇన్​ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (MBF​) అనే రెండు కొత్త కోర్సులను ఇగ్నో ప్రారంభించింది. ఈ రెండు కోర్సులను ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్ (AICTE)​ సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఎంబీఏ కోర్సులో చేరేందుకు జనరల్‌ విద్యార్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. రిజర్వ్‌డ్‌ కోటా అభ్యర్థులైతే 45 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఈ రెండు కోర్సులకు సంబంధించిన విద్యార్హత, దరఖాస్తు గడువు, ఫీజు వంటి కీలక వివరాల కోసం ఇగ్నో అధికారిక వెబ్​సైట్​ను సంప్రదించవచ్చని అభ్యర్థులకు సూచించింది.

Also Read: SDLCE (KU): ఇంటి వద్ద ఉండి చదవాలనుకుంటున్నారా.. కాకతీయ యూనివర్సిటీ మీకో గోల్డెన్ ఛాన్స్ ఇస్తుంది..

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
Paper Leak New Bill: పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !
పేపర్ లీక్‌ బిల్లు.. బాధ్యులకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల జరిమానా !

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Sri Lanka Death Sentence: శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
శ్రీలంక మాజీ పోలీస్ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీకి మరణశిక్ష - బాంబు దాడులను ఆపలేకపోవడమే కారణం!
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Embed widget