Telangana Inter 1st Year Exam: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. పూర్తి వివరాలు
హుజూరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల దృష్ట్యా ఇంటర్ ఫస్టియర్ పరీక్షల తేదీలను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ మార్చింది. కొత్త షెడ్యూల్ ప్రకటిస్తూ.. పరీక్షల తేదీలను మార్పులను ఇంటర్ బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 29, 30 తేదీలలో షెడ్యూల్ చేసిన పరీక్షలను అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీలకు మార్పు చేస్తూ కొత్త షెడ్యూల్ విడుదల చేశారు. శుక్ర, శనివారం జరగాల్సిన పరీక్షలను ఆది, సోమవారాల్లో నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేశారు.
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్..
అక్టోబర్ 25 - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1,
అక్టోబర్ 26 - ఇంగ్లీష్ పేపర్-1,
అక్టోబర్ 27 - మాథ్య్ పేపర్-1, బొటనీ 1, పొలిటికల్ సైన్స్-1,
అక్టోబర్ 28 - మాథ్య్ పేపర్-1బీ, జూవాలజీ-1, హస్టరీ-1,
నవంబర్ 1 - కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్-1,
నవంబర్ 2 - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1,
నవంబర్ 3 - మోడర్న్ లాగ్వేజ్ పేపర్-1, జాగ్రఫి పేపర్ 1
Also Read: ఏపీ నిట్‌లో ఎంబీఏ కోర్సు.. అక్టోబర్ 30తో ముగియనున్న దరఖాస్తు గడువు.. ముఖ్యమైన వివరాలివే..
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. కోవిడ్19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించి ఎగ్జామ్ హాల్ లోకి రావాలని సూచించారు.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద శానిటైజర్స్ ఉంచి విద్యార్థులకు శానిటైజేషన్ తప్పనిసరి అని చెప్పింది. కరోనా లక్షణాలైన జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉంటే పరీక్షా కేంద్రాలలో ఇంఛార్జీలకు, ఇతర సెంటర్ నిర్వాహకులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు. కరోనా కారణంగా విద్యార్థులు ప్రమోట్ అయి రెండో సంవత్సరానికి ప్రమోట్ కావడం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన తీరుగానే పరీక్షలను 70 శాతం సిలబస్తో నిర్వహించనున్నారు.
Also Read: విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్స్.. వచ్చే నెలతో ముగియనున్న గడువు..