Pakistan Fisherman: వలలో చిక్కిన బంగారు చేప, రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు
Pakistan Fisherman: పాకిస్థాన్‌లో ఓ మత్స్యకారుడికి అరుదైన చేప చిక్కి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు.
Pakistan Fisherman:
చిక్కిన అరుదైన చేప
చేపలు పట్టుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తికి ఒక్కసారిగా అదృష్టం కలిసొచ్చింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయాడు. అయిపోయాడు. లాటరీ ఏం తగల్లేదు కానీ దాదాపు అలాంటి జాక్‌పాట్ కొట్టేశాడు పాకిస్థాన్‌కి చెందిన (Pakistan Fisherman) మత్స్యకారుడు. చేపలు పడుతుండగా వలలో చాలా అరుదైన చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలున్న ఆ చేపకి మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. అరేబియా సముద్రంలో చేపలు పడుతుండగా గాలానికి చిక్కింది ఈ చేప. ఈ చేపని స్థానికంగా Sowa Fish అని పిలుస్తారు. ఈ చేపను చూసిన వెంటనే ఎగిరి గంతేశాడు హాజీ బలోచ్. సుడి తిరిగిపోయిందనుకున్నాడు. వెంటనే ఆ చేపను వేలం వేశాడు. కరాచీ హార్బర్‌లో వేలం వేయగా ఓ వ్యక్తి 7 కోట్లకు కొనుక్కున్నాడు. చేపకు రూ.7 కోట్లు ఏంటి బాబోయ్ అని మనకు అనిపించినా...దానికున్న డిమాండ్ అలాంటిది మరి. పాకిస్థాన్ ఫిషర్‌మేన్ ఫోక్ ఫోరమ్‌కి చెందిన వ్యక్తే ఈ చేపను వేలంలో దక్కించుకున్నాడు.
సోవా ఫిష్‌కి ఫుల్ డిమాండ్..
సోవా ఫిష్ చాలా అరుదుగా కనిపిస్తుంది. నిజానికి మార్కెట్‌లో దానికి వెలకట్టలేనంత డిమాండ్ ఉంటుంది. అందుకే కోట్లు పెట్టి మరీ కొనుక్కుంటారు. ఈ చేపలో ఎన్నో విలువైన ఔషధ గుణాలుంటాయి. ఈ చేపలో (Sowa Fish Significance) దారం లాంటి పదార్థం ఉంటుంది. అది సర్జరీల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఈ చేప బరువు 20-40 కిలోల వరకూ ఉంటుంది. 1.5 మీటర్ల మేర పెరుగుతుంది. తూర్పు ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. సంప్రదాయ వైద్యంలోనూ ఈ చేపలను వినియోగిస్తారు. ఇక స్థానిక వంటల్లోనూ దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. మొత్తం 7గురు వ్యక్తులు ఈ చేపను పట్టుకున్నారు. వేలంలో వచ్చిన డబ్బుల్ని వీళ్లంతా పంచుకున్నారు. సంతానోత్పత్తి చేసే సమయంలో మాత్రమే ఇది తీర ప్రాంతాలకు వస్తూ ఉంటుంది. అలా పాక్ మత్స్యకారుడి వలలో చిక్కింది.
Also Read: ఏ బెదిరింపునీ తేలిగ్గా తీసుకోం - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్ వీడియోపై కెనడా ప్రకటన