అన్వేషించండి

ఏ బెదిరింపునీ తేలిగ్గా తీసుకోం - గురుపత్వంత్ సింగ్ వార్నింగ్‌ వీడియోపై కెనడా ప్రకటన

India Canada Tensions: గురుపత్వంత్ సింగ్ వార్నింగ్ వీడియోపై కెనడా స్పందించింది.

India Vs Canada Issue: 

వార్నింగ్ వీడియో..

India Canada Issue: నవంబర్ 19వ తేదీన Air India విమానాల్లో ఎవరూ ప్రయాణించొద్దంటూ ఖలిస్థానీ మద్దతుదారుడు గురుపత్వంత్ సింగ్ పన్నున్ (Gurpatwant Singh Pannun) వార్నింగ్ ఇచ్చాడు. వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్ అవడమే కాకుండా సంచలనం సృష్టించింది. దీనిపై ఇప్పటికే భారత్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు కెనడా ఈ వీడియోపై స్పందించింది. ఖలిస్థానీ మద్దతుదారుల బెదిరింపులను అంత తేలిగ్గా తీసుకోమని, ముఖ్యంగా ఎయిర్‌ లైన్స్‌ విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని స్పష్టం చేసింది. కెనడా రవాణా మంత్రి పాబ్లో రోడ్రిగెజ్ ( Pablo Rodriguez) స్వయంగా ఈ ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు. కెనడా పోలీసులు ఇప్పటికే విచారణ మొదలు పెట్టారని తెలిపారు. గత వారమే గురుపత్వంత్ సింగ్ ఈ వీడియో పోస్ట్ చేశాడు. Sikhs for Justice సంస్థకి జనరల్ కౌన్సిల్‌గా ఉంటున్నాడు గురుపత్వంత్. "నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించకండి. మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయ్" అని వార్నింగ్ ఇచ్చాడు. అయితే...ఇది బెదిరింపు కాదని, కేవలం భారత్‌తో మైత్రిని కొనసాగించకుండా నిషేధం విధించాలన్నదే తమ లక్ష్యం అని చెప్పాడు. కెనడాలో దాదాపు 7 లక్షల 77 వేల మంది సిక్కులున్నారు. ఆ దేశ జనాభాలో వీళ్ల వాటా 2%. అందుకే చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది కెనడా ప్రభుత్వం. 

నిజ్జర్ హత్యతో చిచ్చు..

ఈ ఏడాది జూన్‌లో హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య (Hardeep Singh Nijjar Killing) రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టింది.  ఆ సమయంలోనే ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్యలో భారత్ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య దూరం పెరుగుతూనే ఉంది.

నిజ్జర్ హత్య కేసు విచారణలో కెనడా అధికారులు పోలీసులకు విచారణలో సహకరించడం లేదని ఆరోపించారు భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ. Globe and Mail కి ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణను కొంత మంది కెనడా ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. కుట్రపూరితంగా భారత్‌పై ఈ తప్పుని తోసేందుకు ప్రయత్నం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. 

"నిజ్జర్ హత్యపై కెనడాలో విచారణ జరుగుతోంది. కానీ అది సరైన విధంగా జరగడం లేదు. ఇప్పటికే కొందరు అధికారులు ఇందులో జోక్యం చేసుకున్నారు. విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ హత్య వెనకాల కచ్చితంగా భారత్‌కి చెందిన వాళ్లు ఉన్నారని నిరూపించాలని పై నుంచి ఒత్తిడి వస్తోంది. కెనడా భద్రతా బలగాలన్నీ పనిగట్టుకుని మరీ దీన్ని రుజువు చేసేందుకు కుట్ర చేస్తున్నాయి"

- సంజయ్ కుమార్ వర్మ, భారత హై కమిషనర్

Also Read: Delhi Pollution News: మేం జోక్యం చేసుకుంటే తప్ప మీలో చలనం రాదా? ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

టాప్ హెడ్ లైన్స్

AP New Railway Lines: ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలానికి నేరుగా రైలు మార్గం.. రాయలసీమ, ఏజెన్సీ ప్రాంతాల కనెక్టివిటీ!
ఏపీలో మూడు కొత్త రైల్వే లైన్లు.. శ్రీశైలానికి నేరుగా రైలు మార్గం.. రాయలసీమ, ఏజెన్సీ ప్రాంతాల కనెక్టివిటీ!
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Andhra Yuvasankalp 2k26: ఆంధ్ర యువసంకల్ప్ 2కె26 పోటీలు.. రూ.లక్ష గెలుచుకునే సువర్ణావకాశం.. ఇలా అప్లై చేసుకోండి!
ఆంధ్ర యువసంకల్ప్ 2కె26 పోటీలు.. రూ.లక్ష గెలుచుకునే సువర్ణావకాశం.. ఇలా అప్లై చేసుకోండి!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
Embed widget