అన్వేషించండి

Top 10 Headlines Today: ఏపీలో మూడు రాజధానుల ముచ్చట మూలన పడ్డట్టేనా? తెలంగాణ బీజేపీ ప్లాన్ ఏంటీ?

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టారా ?

ఏపీలో రాజకీయ పొత్తులపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ,జనసేనతో కలుస్తామని ఢిల్లీ బీజేపీ నేతలు సంకేతాలు పంపుతున్నారు.  కానీ ఇప్పుడే మాట్లాడబోమని.. చంద్రబాబు తేల్చి చెబుతున్నారు. ఆయన నోటి వెంట ఒకటే మాట వినిపిస్తోంది..అదేమిటంటే రాష్ట్ర ప్రయోజనాలు. వాటిపై హామీ లభిస్తే పొత్తుకు ఆయన సిద్ధంగా ఉంటారని అంటున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రయోజనాలేమిటి ? వీటి గురించి .. బీజేపీ పెద్దల వద్ద ప్రతిపాదనలు పెట్టారా ?  వారి నుంచి స్పందన రావడం లేదా ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రంగంలోకి అగ్రనాయకత్వం

తెలంగాణ  బీజేపీ  వ్యూహాత్మకంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది.   రాష్ట్ర అధ్యక్షుడి మార్పు, పార్టీలో కొత్తగా కొంత మందికి పదవులు ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేందుకు కార్యాచరణ రెడీ చేసుకుంది. ల బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అనేలా ఉన్న బీజేపీకి మునుపటి పరిస్థితులు తీసుకురావడానికి  రెడీ అయ్యారు. ఇందు కోసం అగ్రనాయకత్వం కూడా రంగంలోకి దిగిందని చెబుతున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మూడు ముచ్చట మూలకు చేరినట్టేనా?

ఇక మూడు రాజధానుల ముచ్చట మూలకు చేరినట్లేనా..?  ఈ ప్రభుత్వ కాలపరిమితి ముగిసేలోగా జరిగే పనైతే కాదు. రాజధాని కేసును డిసెంబర్ కు వాయిదా వేయడంతో ఈ విషయం రూఢీ అయిపోయింది. రాష్ట్రానికి సంబంధించి చాలా కీలకమైన ఆ పరిణామం అతి మామూలుగా ముగిసింది. సుప్రీంకోర్టులో రోజూ జరిగే వేలాది కేసుల్లో ఒకటిలాగా దాన్ని వాయిదా వేశారు. ఇందులో పార్టీలైన రాష్ట్ర ప్రభుత్వం కానీ.. దాని అపోనెంట్స్ కానీ ఎవరూ కూడా పెద్దగా స్పందించలేదు. ఊహించిందే లే అన్నట్లుగా కథ ముగిసింది. బహుశా రెండు పార్టీలూ కోరుకుంది ఇదే అనుకుంటా..! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరోసారి పవన్ ఘాటు వ్యాఖ్యలు

ఇంట్లో పిల్లల్ని చూసుకొనే గృహిణుల్ని సీఎం జగన్ నీచంగా మాట్లాడి బాగా దిగజారిపోయారని, సంస్కార హీనుడు అయిపోయారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా తాను ఎప్పుడూ విమర్శించలేదని అన్నారు. తాము ఎప్పుడూ సీఎం జగన్‌ సతీమణి భారతిని వివాదాల్లోకి లాగలేదని గుర్తు చేశారు. కానీ, జగన్‌ పదే పదే తన భార్య, తల్లిదండ్రుల గురించి ప్రస్తావింటున్నారని అన్నారు. జగన్ కు సంస్కారం లేదని, ఆయనకు సీఎంగా ఉండే అర్హత లేదని విమర్శించారు. తాడేపల్లి గూడెంలో నిర్వహించిన వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ‘‘నువ్వొక సంస్కార హీనుడివి జగన్.. వెళ్లి ఒకసారి భారతి మేడం గారిని అడుగు ఎప్పుడైనా ఆవిడని మేము దూషించామా అని’’ పవన్ కల్యాణ్ నిలదీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వచ్చేది కాంగ్రెస్‌: రేవంత్

కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు "మూడు గంటలు" అంటూ ఎంత దుష్ప్రచారం చేసినా.. మూడు చెరువుల నీళ్లు తాగినా.. బీఆర్ఎస్ సర్కారు మూడోసారి అధికారంలో రావడం కల్లా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తామన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. 12 గంటల పాటు కూడా తెలంగాణ సర్కారు నాణ్యమైన ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్న విషయం ఏ సబ్ స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల అప్పుల్లో ముంచడం జరిగిందన్నారు. అలాగే సర్కార్ విద్యుత్ కుంభకోణాలను వెలికితీస్తామన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి 120 ఎకరాలు ఎలా సంపాదించాడో కూడా తేలుస్తామన్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టీమిండియా డామినేషన్‌

ఐసీసీ టెస్ట్‌ బౌలింగ్‌లో టాప్‌ ర్యాంక్‌లో ఉన్న అశ్విన్ మరోసారి తన మ్యాజిక్‌తో విండీస్‌పై అద్భుతం చేశాడు. టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డొమినికాలో తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో 24.3 ఓవర్లు వేసి అరవై పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో 64.3 ఓవర్లు ఆడిన విండీస్‌150 పరుగులు మాత్రమే చేసింది. అశ్విన్‌కు జడేజా కూడా తోడుయ్యాడు. జడేజా 14 ఓవర్లు విసిరి 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

యమున ఉగ్రరూపం

దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరద పోటుకు యమునా ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. 45 ఏళ్ల తర్వాత నది నీటిమట్టం 208.30 మీటర్లు దాటింది. వరద పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టాప్‌ కార్స్

భారతదేశంలో సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ / క్రాస్ఓవర్ సెగ్మెంట్‌లోనే అత్యధిక వాహనాలు అమ్ముడుపోయాయి. ఈ విభాగంలో మార్కెట్‌లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 2023 జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఫీజులపై హైకోర్టులో కేసు

ఏపీలోని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ విషయమై హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజు నియంత్రణ విషయంలో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నాయి. కళాశాలల తరఫున న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. ఏటా ఫీజులు తగ్గించుకుంటూ వెళ్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. రెగ్యులేటరీ కమిషనర్ చట్టం, నియమాలకు విరుద్ధంగా వెళ్తున్నారంటూ వివరించారు. రెగ్యులేటరీ కమిషన్ తరఫున సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించగా.. హైకోర్టు ధర్మాసనం స్పందించింది. కమిషన్ విద్యా సంస్థలకు ముందస్తు అవకాశం ఇచ్చిందో లేదో చెప్పాలని, అప్పటి వరకు ఫీజులపై నోటిఫికేషన్ ఇవ్వకూడదిన వెల్లడించింది. తదుపరి విచారణను ఇదే నెల 18వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టమాటాలతో కాసుల వర్షం

కూరగాయాల ధరలు ఎంత పెరిగినా పండించే రైతున్నకు దక్కేది కొంతే! వినియోగదారులు ఎలాగూ అధిక ధరలకే కొంటారు. ఏదేమైనా అల్టిమేట్‌గా లాభపడేది మధ్య దళారులే! ఇప్పటి వరకు మనం అలవాటు పడిన సన్నివేశం ఇదే! అయితే టమాట పుణ్యామా అని కొన్ని రైతు కుటుంబాలు ఇప్పుడు డబ్బుల పంట పండిస్తున్నాయి. కర్ణాటకలోని ఓ అన్నదాత కుటుంబం ఒకే రోజు ఏకంగా రూ.38 లక్షల సొమ్ము కళ్లచూసింది!పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Shreyas Iyer 97 Runs vs GT IPL 2025 | గుజరాత్ బౌలర్లను చెండాడిన శ్రేయస్ అయ్యర్ | GT vs PBKS | ABPMysterious Tree in Manyam Forest | ప్రాణాలు తీస్తున్న వింత వృక్షం..ఆ పల్లెలో అసలు ఏం జరుగుతోంది? | ABP DesamKL Rahul Athiya shetty Baby Girl | పాపకు జన్మనిచ్చిన రాహుల్, అతియా శెట్టి | ABP DesamGoenka Pant KL Rahul | IPL 2025 లోనూ కొనసాగుతున్న గోయెంకా తిట్ల పురాణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆన్‌లైన్ బెట్టింగ్‌కు చెక్ - ప్రత్యేక చట్టం తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Telangana Latest News:ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
ఏప్రిల్‌ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ! రేవంత్ రెడ్డి టీంలో చోటు దక్కేది వీళ్లకేనా?
Property Tax: ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
ఆస్తి పన్ను బకాయిలపై గుడ్ న్యూస్ - ఏపీని మించి తెలంగాణలో భారీ రాయితీ
Ippala Ravindra Reddy: లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
లోకేష్‌ను కలిసిన సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి - ఉలిక్కిపడిన టీడీపీ - ఎవరీ వ్యక్తి ?
Manoj Bharathiraja: తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
తమిళ దర్శకుడు భారతీరాజా ఇంట తీవ్ర విషాదం...‌ కుమారుడు మనోజ్ హఠాన్మరణం
SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
Telangana MLAs Case: ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా ? వాటిని దాటి ముందుకెళ్లలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
IPL 2025 PBKS VS GT Result Update : పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
పంజాబ్ స్టన్నింగ్ విక్టరీ.. అన్నిరంగాల్లో సత్తా చాటిన కింగ్స్.. సుదర్శన్, బట్లర్ పోరాటం వృథా
Embed widget